Jan 09,2023 20:39

పొలాలను పరిశీలిస్తున్న ఎడిఎ

పొలాలను పరిశీలిస్తున్న ఎడిఎ
'నానో' యూరియాతో రైతులకు ఊరట
ఇందుకూరుపేట:ఇఫ్కో కంపెనీ ద్వారా తయారు చేయబడ్డ నానో యూరియా ద్రావణం ాణ్యతా ప్రమాణంలో ధీటుగా ఉండి రైతులకు ఎంతో ఉపయోగకరమని ఇందుకూరుపేట ఎడిఎ పేర్కొన్నారు. సోమవారం ఇందుకూరుపేట జగదేవిపేట గ్రామాలలో పొలాలను ఆయన సందర్శించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గుళికల రూపంలోని యూరియా కంటే ద్రవరూపంలో ఉన్న నానో యూరియా సమర్థవంతంగా పనిచేసే తక్కువ ఖర్చుతో 500 ఎంఎల్‌ ఒక ఎకరానికి సరిపోతుందన్నారు. దీనివల్ల తెగుళు,్ల పురుగుల బెడద తగ్గు తుందన్నారు.
కార్యక్రమంలో ఇఫ్కో ప్రతినిధి లక్ష్మీనారాయణ, గ్రామ వ్యవసాయ నాయకులు నవీన్‌, సుజాత, పలువురు రైతులు పాల్గొన్నారు.