నాలుగేళ్ల పరిపాలనలో అభివృద్ధి శూన్యం
ప్రజాశక్తి-వరికుంటపాడు : నాలుగేళ్ల పరిపాలనలో అభివృద్ధి అనే మాట లేకుండా రాష్ట్రాన్ని పరిపాలించిన ఏకైక ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి నిలిచాడని మాజీఎంఎల్‌ఎ బొల్లినేని వెంకట రామారావు ఎద్దేవా చేశారు. మండలంలోని డక్కునూరు గ్రామంలో ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రాన్ని అప్పుల ఆంధ్రప్రదేశ్‌గా మార్చి అన్ని రంగాలను నిర్వీర్యం చేశారని ధ్వజమెత్తారు. రానున్న ఎన్నికల్లో ప్రజలంతా తెలుగుదేశం పార్టీని గెలిపించాలని ఆయన కోరారు. ముందుగా రామాలయంలో దైవ ఆశీర్వాదం తీసుకొని ఎస్‌సి కాలంలో ఇంటింటా పర్యటన చేశారు. తరాలు మారిన నాయకులు మారుతున్న తమ తలరాతలు మారడం లేదని దళితులు ఆవేదన వ్యక్తం చేయడంతో గతంలో గ్రామానికి రోడ్డు మంచినీటి ట్యాంకును ఏర్పాటు చేశామని ప్రభుత్వం రాకపోవడంతో చేయలేకపోయామని ప్రభుత్వం రాగానే రెండు కిలోమీటర్ల రోడ్డును నీటి వసతిని కల్పిస్తామని హామీనిచ్చారు. కార్యక్రమంలో మండల కన్వనర్ చండ్ర మధుసూదన్ రావు, చండ్ర వెంకయ్య నాయుడు, ముజ్జే లక్ష్మీనారాయణ, పలువురు టిడిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.










