Jan 29,2023 22:04

ఫొటో : మాట్లాడుతున్న శ్రీకాంత్‌రెడ్డి

నాక్‌ మెయిల్స్‌కు సహకరించాలి
ప్రజాశక్తి-ఆత్మకూరుఅర్బన్‌ :హొనాక్‌ మెయిల్స్‌కు స్పందించాలని, డాక్టర్‌ బి.ఆర్‌.అంబేద్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయం నాక్‌ అక్రిడిటేషన్‌ సాధించడంలో విద్యార్థులు భాగస్వాములు కావాలని ఆ యూనివర్సిటీ అభ్యాసక సహాయకేంద్రం కోఆర్డినేటర్‌ జి.శ్రీకాంత్‌ రెడ్డి కోరారు. ఆత్మకూరు ఎస్‌.ఆర్‌.జె.డిగ్రీ కళాశాలలో యూనివర్సిటీలో చదువుతున్న విద్యార్థులతో ఏర్పాటు చేసిన సమావేశంలో కోఆర్డినేటర్‌ శ్రీకాంత్‌ మాట్లాడారు. విద్యార్థులకు నాక్‌ నుంచి మెయిల్స్‌ వస్తున్నాయని ఆ మెయిల్స్‌కు తక్షణం స్పందించాలని సూచించారు. 20 ప్రశ్నలతో కూడిన మెయిల్‌ వస్తుందని విద్యార్థులు కనీసం రెండు రోజులకు ఒకసారి మెయిల్స్‌ చూసుకోవాలన్నారు.
నాక్‌ అక్రిడిటేషన్‌ అసెస్మెంటులో భాగంగా యూనివర్సిటీలో అందించే సేవలపై విద్యార్థుల అభిప్రాయాలు తెలుసుకునేందుకే నాక్‌ ప్రశ్నావళిని ఇ మెయిల్స్‌ ద్వారా పంపుతుందని, మెయిల్‌ అందుకున్న విద్యార్థులు ఆ ప్రశ్నలకు తగిన జవాబులు గుర్తించి తిరిగి పంపాలని సూచించారు. సులువుగా ఇంగ్లీషులో 20 ప్రశ్నలు ఉంటాయని ఆయా ప్రశ్నల కింద ఉన్న సమాధానల్లో ఒకదైనీపై క్లిక్‌ చేయాలన్నారు. అన్ని ప్రశ్నల సమాధానాలపై క్లిక్‌ చేశాక సబ్మిట్‌పై క్లిక్‌ చేయాలని తెలిపారు. విద్యార్థులకు ఎలాంటి అనుమానాలు ఉన్న అభ్యాసక సహాయ కేంద్రంలో సంప్రదించాలని కోరారు. నాక్‌ నుంచి విడతల వారీగా విద్యార్థులకు మెయిల్స్‌ వస్తాయని క్రమం తప్పకుండా మెయిల్స్‌ చూస్తూ ఉండాలని తెలిపారు. కార్యక్రమంలో అధ్యాపకులు రవీంద్ర, పుల్లయ్య, హజరత్‌, పెంచలయ్య విద్యార్థులు పాల్గొన్నారు.