Jun 15,2023 21:40

విద్యార్థిని అభినందిస్తున్న ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి

రాజంపేట రూరల్‌ : నాడు-నేడుతో ప్రభుత్వ పాఠశాలలకు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి మహర్దశను తీసుకొచ్చారని ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి పేర్కొన్నారు. నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో ఆణిముత్య విద్యార్థులకు ఆకేపాటి అనిల్‌ కుమార్‌రెడ్డితో కలసి ప్రధమ, ద్వితీయ, తతీయ బహుమతులను ప్రదానం చేశారు. ప్రథమ బహుమతికి రూ.15 వేలు, ద్వితీయ బహుమతి రూ.10వేలు, పదివేలు, తతీయ బహుమతిగా రూ.5 వేలు చొప్పున విద్యార్థులకు అందించారు. ఈ సందర్భంగా మేడా మాట్లాడుతూ నాడు-నేడు ద్వారా పిల్లల పాఠశాలలను ముఖ్యమంత్రి ఎంతో అభివద్ధి చేశారని, ప్రభుత్వపాఠశాలలు మరింత అభివద్ధి చెందుతున్నాయని అన్నారు. ఎమ్మెల్యే పుట్టి పెరిగిన గ్రామానికి చెందిన ఓ విద్యార్థి సభా సమావేశంలో ఆంగ్లంలో మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి విద్యా బోధనకు పిల్లల భవిష్యత్తుకు అభివద్ధి చేస్తున్నారని చెప్పడంపై ఆయన అభినందించారు. కార్యక్రమంలో మాజీ మార్కెట్‌ యార్డ్‌ చైర్మన్‌, వైసిపినాయకులు ఎల్లారెడ్డి, కబడ్డీ అసోసియేషన్‌ కడప జిల్లా అధ్యక్షులు ఈశ్వర్‌రెడ్డి, సీనియర్‌ నాయకులు శరత్‌కుమార్‌రాజు, సర్పంచ్‌ రాజా, వైసిపి నాయకులు విశ్వనాథరాజు ఎంపిటిసి మధుబాబు, వైస్‌ సర్పంచ్‌ సాంబయ్య, పేట వార్డ్‌ కౌన్సిలర్‌ పసుపులేటి సుధాకర్‌, విశ్వనాథ్‌రెడ్డి, మురళి రెడ్డి, దండుగోపి, పెంచలయ్య, శంకరయ్య, వైసిపి మహిళా నాయకురాలు మిరియాల సురేఖ పాల్గొన్నారు.