పరిగి: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నాడు-నేడు కార్యక్రమాల ద్వారా ప్రభుత్వ పాఠశాలలకు మహర్ధశ సంతరించుకుంటోందని ఎమ్మెల్యే శంకర నారాయణ పేర్కొన్నారు. శనివారం నాడు మండల పరిధిలోని శీరేకోళం, ధనపురం గ్రామాల్లో నిర్వహించిన గడపగడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రజలతో ప్రభుత్వ పథకాల అమలు, లబ్ధిపై అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన నవరత్నాల లబ్ధిని ప్రతి ఒక్కరికీ అందిస్తున్నట్లు చెప్పారు. 2024 ఎన్నికల్లో ప్రజలు వైసిపిని మరింత మెజారిటీతో గెలిపించాలని కోరారు. అనంతరం జడ్పీహెచ్‌ఎస్ పాఠశాలలో చేపడుతున్న ప్రహరీ నిర్మాణం, మరుగుదొడ్ల నిర్మాణాలను పరిశీంచి, పనులను త్వరితగతిని పూర్తి చేయించాలని గుత్తేదారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ శ్రీరాములు, సర్పంచి నీరగంటి ప్రభాకర్, ఎంపీటీసీ గంగాదేవి రాము, మంజునాథ్ రెడ్డి, ప్రభాకర్, డివి.రమణ పాల్గొన్నారు.










