May 19,2023 21:56

అధికారులతో మాట్లాడుతున్న కలెక్టర్‌

ప్రజాశక్తి బత్తలపల్లి : నాడునేడు పథకం కింద పాఠశాలల్లో జరుగుతున్న అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని కలెక్టర్‌ పి.అరుణ్‌ బాబు ఆదేశించారు. శుక్రవారం తాడిమర్రి మండల కేంద్రంలోని విద్యాశాఖ కార్యాలయాన్ని, మండలంలోని పిన్నదరి గ్రామం జిల్లా పరిషత్‌ హై స్కూల్‌లో నాడు - నేడు కింద చేపట్టిన అభివృద్ధి పనులను కలెక్టర్‌తనిఖీ చేశారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ పాఠశాలలో జరుగుతున్న అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. పాఠశాలలో మరుగుదొడ్ల పనులు పూర్తికాగా, మిగిలిన అన్ని రకాల పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. అంతకుముందు కలెక్టర్‌ తాడిమర్రి విద్యాశాఖ కార్యాలయాన్ని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా 2023 -24 సంవత్సరానికి సంబంధించి వచ్చిన టెస్ట్‌బుక్‌లను పరిశీలించి స్టాకు వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో డిఇఒ మీనాక్షి, ఎంఇఒ కృష్ణమోహన్‌, తహశీల్దార్‌ నాగరాజు, ఎంపిడిఒ విజయలక్ష్మి, పిఆర్‌ ఎఇ, ఇతర అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.