Jun 23,2023 21:59

ఫొటో : సిబ్బందితో మాట్లాడుతున్న డిప్యూటీ డిఇఒ

నాడు-నేడు పనులు పరిశీలన
ప్రజాశక్తి-మర్రిపాడు : మండలంలోని చిలకపాడు ఉన్నత పాఠశాలలో జరుగుతున్న నాడు-నేడు పనులను శుక్రవారం డిప్యూటీ డిఇఒ పరిశీలించారు. ఆటస్థలం మంజూరు నిమిత్తం గ్రామస్తులు విజ్ఞప్తులు సమర్పించిన నేపథ్యంలో కావలి డివిజన్‌ ఉప విద్యాశాఖాధికారి హరిప్రసాద్‌ పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన ఆటస్థలం కోసం గ్రామస్తులు సూచించిన స్థలాన్ని, పాఠశాలలో జరుగుతున్న నాడు-నేడు పనులను పరిశీలించారు.
కార్యక్రమంలో మర్రిపాడు ఎంఇఒ-2 ధనలక్ష్మి, చిలకపాడు సర్పంచ్‌ సిద్ధంరెడ్డి రమా మోహన్‌ రెడ్డి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసులు, కరటంపాడు ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు మాలకొండ రావు, ఎమ్మార్జీ రాజేంద్రకుమార్‌, ఉపాధ్యాయులు, గ్రామస్తులు పాల్గొన్నారు.