Mar 17,2023 21:42

ఫొటో : విద్యార్థులతో మాట్లాడుతున్న ఎంఇఒ మస్తాన్‌వలీ

నాడు-నేడు పనులు పరిశీలన
ప్రజాశక్తి-ఉదయగిరి : మన బడి నాడు-నేడు ఫేస్‌ -2 పనులను శుక్రవారం మండల విద్యాశాఖ అధికారి షేక్‌ మస్తాన్‌ వలి పరిశీలించారు. స్థానిక ఎంపిపిఎస్‌ బిసి కాలనీ తెలుగు పాఠశాలను ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా తరగతుల వారీగా విద్యార్థుల పఠన అభ్యసన నైపుణ్య సామర్థ్యాలను పరిశీలించి నల్లబల్లపై విద్యార్థుల తెలుగు సామర్థ్యాలను పరిశీలించారు. విద్యార్థులకు చదవడం రాయడం తప్పనిసరిగా వచ్చి ఉండాలని పలు సూచనలను చేశారు. అనంతరం పాఠశాలలో జరుగుతున్న నాడు-నేడు పనులను పరిశీలించి నాణ్యమైన మెటీరియల్‌ వాడుతూ నాణ్యతతో పనులు త్వరితగతిన పూర్తయ్యే విధంగా ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు బాధ్యత తీసుకోవాలన్నారు.
వాహనంలో వచ్చిన గుడ్లను తనిఖీ చేస్తూ ప్రతిసారి గుడ్ల క్వాంటిటీ క్వాలిటీని చెక్‌ చేసిన తర్వాతే గుడ్లు తీసుకోవాలన్నారు. అలాగే పాఠశాల అన్ని రికార్డులను పరిశీలించి విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేస్తూ విద్యార్థుల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. ఉపాధ్యాయులకు ప్రధానోపాధ్యాయులకు మధ్యాహ్న భోజన నిర్వాహకులకు పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు జి.నాగయ్య, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.