మాట్లాడుతున్న కమిషనర్
నాడు - నేడు'' పనులను వేగవంతం చేయండి
- కమిషనర్ వికాస్ మర్మత్, ఐ.ఏ.ఎస్
నెల్లూరు:''నాడు - నేడు'' అభివద్ధి పనులను వేగవంతం చేసి పాఠశాలల పునప్రారంభం నాటికి అదనపు తరగతి గదులు, మరుగుదొడ్ల నిర్మాణాలను విద్యార్థులకు అందుబాటులోకి తేవాలని నగర పాలక సంస్థ కమిషనర్ వికాస్ మర్మత్ అధికారులను ఆదేశించారు. స్థానిక నవాబు పేట మున్సిపల్ పాఠశాలలో జరుగుతున్న నిర్మాణ పనులను కమిషనర్ ఇంజనీరింగ్ అధికారులతో కలిసి మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ అదనపు తరగతి గదులతో పాటు నూతన మరుగుదొడ్ల నిర్మాణాలను జూన్ 12 వ తేదీ నాటికి పూర్తి చేయాలని చెప్పారు. నిర్మాణ పనులన్నీ అత్యంత నాణ్యతతో, పారదర్శకంగా జరిగేలా అధికారులు పర్యవేక్షించాలని సూచించారు.అనంతరం స్థానిక సుబేదారు పేట ప్రాంతంలో నిర్మాణమవుతున్న ప్రజా మరుగుదొడ్ల పనులను కమిషనర్ తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో ఇంజనీరింగ్ విభాగం ఎస్.ఈ సంపత్ కుమార్, ఈ.ఈలు చంద్రయ్య, అనిల్, ఏ.ఈ మాధవి, సచివాలయాల సిబ్బంది పాల్గొన్నారు.










