May 10,2023 21:02

ఫొటో : పనులు పరిశీలిస్తున్న ఎంపిడిఒ ఐజాక్‌ప్రవీణ్‌

నాడు-నేడు పనులను పూర్తి చేయాలి
ప్రజాశక్తి-ఉదయగిరి : మనబడి నాడు-నేడు ఫేస్‌-2 పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఎంపిడిఒ ఐజాక్‌ ప్రవీణ్‌ పేర్కొన్నారు. బుధవారం స్థానిక మండల ప్రజా పరిషత్‌ ప్రాథమిక పాఠశాల నాగుల బావి వీధిలో జరుగుతున్న పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా పాఠశాలలో జరుగుతున్న టాయిలెట్‌ నిర్మాణాలను, క్లాస్‌రూమ్‌ రిపేర్లు వంటగది ఎలక్ట్రికల్‌ పనులను పరిశీలించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ జూన్‌ 12న పాఠశాలలు పునప్రారంభం కానున్నాయని తరగతులు ప్రారంభం ముందే చేపట్టే పనులన్నింటినీ వేగవంతంగా పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రధానోపాధ్యాయులకు సూచించారు. విద్యా కమిటీ సభ్యుల సమన్వయంతో పనులను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు వెంకటేశ్వర్లు, ఉపాధ్యాయులు, ఇంజనీరింగ్‌ అసిస్టెంట్‌ ఆదిశేషారెడ్డి పాల్గొన్నారు.