Nov 17,2023 13:05

ప్రజాశక్తి-కాకినాడ : కాకినాడ నగరంలో నిర్మిస్తున్న నాలుగవ ఫ్లై ఓవర్ నిర్మాణం దాదాపు పూర్తయిందని కాకినాడ స్మార్ట్ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం బ్రిడ్జి నిర్మాణ పనుల పురోగతిని ఎమ్మెల్యే అధికారులతో కలిసి పరిశీలించారు. మాజీ మంత్రి ముత్తా గోపాలకృష్ణ పేరిట నిర్మిస్తున్న ఈ బ్రిడ్జ్ ను అతి త్వరలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి చేతుల మీదగా ప్రారంభించడం జరుగుతుందని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాకినాడ నగరపాలక సంస్థ ఎస్ఇ పి సత్యకుమారి, డీఈలు బిహెచ్ సుబ్బారావు, మాధవి, ఏఈ నాగేశ్వరరావు, వైసిపి నాయకులు సుంకర విద్యాసాగర్ మాజీ కార్పొరేటర్ బాల ప్రసాద్ కర్రీ సుజాత రోకల సత్య తదితరులు పాల్గొన్నారు.