ప్రజాశక్తి-నందలూరు: స్థానిక బస్టాండ్ కూడలిలో శుక్రవారం సులబ్ కాంప్లెక్స్ కు ఎంపీపీ మేడ విజయభాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో రాజంపేట ఎమ్మెల్యే మేడ మల్లికార్జున రెడ్డి, జిల్లా పరిషత్ చైర్మన్ ఆకేపాటి అమర్నాథ్ రెడ్డిలు భూమి పూజను నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సులబ్ కాంప్లెక్స్ లేక ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారి ఇబ్బందులు దృష్టిలో ఉంచుకొని ఈ సులబ్ కాంప్లెక్స్ ను ఏర్పాటు చేయడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో నాగిరెడ్డిపల్లి మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ జంబు సూర్య నారాయణ, జిల్లా వర్క్స్ బోర్డ్ ప్రధాన కార్యదర్శి సయ్యద్ అమీర్, మండల కో ఆప్షన్ సభ్యులు కలీం, వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ గొబ్బిళ్ళ త్రినాథ్, వైస్ ఎంపీపీ అనుదీప్, మాజీ సర్పంచ్ లు శంకర్ రెడ్డి, వేల్పుల లక్ష్మీ దేవి,అక్కిరెడ్డి మోహన్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ స్వామి ఎలుమలై, వైసీపీ నాయకులు పెనుబాల నాగ సుబ్బయ్య, కాకి చంద్ర,ఆర్ముగం విశ్వనాధ్, నడివీధి సుధాకర్, అక్కివెంకట రమణ, బలరాం, ఆకేపాటీ రమేష్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.










