వినతిపత్రం అందజేస్తున్న డివైఎఫ్‌ఐ నాయకులు
మ్యాన్‌హోల్‌కు మూత ఏర్పాటు చేయాలి
నెల్లూరు:స్థానిక 14వ డివిజన్ పరిధిలోని గౌడ హాస్టల్ సెంటర్‌లో మ్యాన్‌హౌల్‌కు మూతను కార్పోరేషన్ అధికారులు ఏర్పాటు చేసి స్థానిక ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పించాలని డివైఎఫ్‌ఐ స్థానిక కమిటీ డిమాండ్ చేసింది. శనివారం ఆ ప్రాంతానికి చెందిన సచివాలయం అధికారులకు డివైఎఫ్‌ఐ కమిటీ సభ్యులు సమస్యను వివరించి, పరిష్కారానికి చర్యలు తీసుకోరుతూ వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా డివైఎఫ్‌ఐ నగర కార్యదర్శి బి.పి.నరసింహ మాట్లాడుతూ నగరపాలక సంస్థ అధికారులకు ప్రజలపై బారాలు మోపడం పై ఉన్న శ్రద్ధ ప్రజలకు సౌకర్యాలు కల్పించడంలో కనిపించడం లేదన్నారు. నగరంలోని బాలాజీ నగర్ గౌడ హాస్టల్ సెంటర్ నందు మ్యాన్ హౌల్ గత 15 రోజుల ముందు డేమేజ్ అయి విరిగిపోవడం జరిగిందన్నారు. ఈ విషయంపై శానిటరీ అధికారులకు డివైఎఫ్‌ఐ స్థానిక నాయకులు అనేకసార్లు తెలియజేసినప్పటికీ స్పందన కనిపించడం లేదన్నారు. 15 రోజులు గడిచిన కూడా ఇప్పుడు దాకా అధికారుల స్పందించకపోవడంతో ఈరోజు తెరిచి ఉన్న మ్యాన్ హౌల్ దగ్గర నిరసన తెలిపి అనంతరం ర్యాలీగా వెళ్లి 14 డివిజన్ సచివాలయం అధికారికి వినతిపత్రం అందజేశామన్నారు. ఈ ప్రాంతంలో మ్యాన్ హౌల్ తెరిచి ఉండడం వల్ల వాహనా దారులు, ముసలి వాళ్లు, చిన్న పిల్లలు అనేక ప్రమాదాలు జరుగుతున్నాయని సచివాలయం అధికారికి విజ్ఞప్తి చేశామన్నారు. సమస్యపై సానుకూలంగా స్పందించిన అధికారులు వెంటనే మరమ్మత్తులు జరిపిస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. ఈ కార్యక్రమంలో 14వ డివిజన్ డివైఎఫ్‌ఐ కార్యదర్శి శేఖర్ 15వ డివిజన్ కార్యదర్శి జగదీష్ స్థానిక నాయకులు మహేష్ ,బాలాజీ ,వాసు సుభాని, సునీల్ ,జే మహేష్ తదితరులు పాల్గొన్నారు.










