భూమిపూజ చేస్తున్న ఎమ్మెల్యే శంకరనారాయణ
ప్రజాశక్తి-పెనుకొండ మండలంలోని గుట్టూరు గ్రామంలో నూతనంగా నిర్మించనున్న ముస్లిం కమ్యూనిటీ హాల్ భవన నిర్మాణానికి ఎమ్మెల్యే శంకరానారాయణ సోమవారం భూమిపూజ చేశారు. అనంతరం పెంచిన పెన్షన్ కానుక రూ.2,750 నూతన పెన్షన్లు లబ్ధిదారులకు పంపిణీ చేశారు. అదేవిధంగా 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్‌లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ముస్లిం మత పెద్దలు, ఎంపిపి గీతారామ్మోహన్‌రెడ్డి, జెడ్‌పిటిసి గుట్టూరు శ్రీరాములు, ఎంపిటిసిలు, సర్పంచులు, వైసిపి నాయకులు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు, పెన్షన్ లబ్ధిదారులు, తదితరులు పాల్గొన్నారు.










