Jul 13,2021 10:00

నల్గొండ : ఎగువన కురుస్తోన్న వర్షాల కారణంగా.... మూసీ ప్రాజెక్టుకు వరద ఉధృతి కొనసాగుతోంది. మూసీ ఇన్‌ ఫ్లో 1436.12 క్యూసెక్కులు, ఔట్‌ ఫ్లో 203.58 క్యూసెక్కులుగా నమోదయింది. ప్రాజెక్ట్‌ పూర్తి నీటిమట్టం 645 అడుగులు కాగా, ప్రస్తుతం 641.20 అడుగులుగా కొనసాగుతోంది. పూర్తిస్థాయి నీటినిల్వ 4.46 టిఎంసి లకు గాను ప్రస్తుతం 3.50 టిఎంసి లుగా నమోదయ్యింది.