అభివృద్ధి పనులను ప్రారంభిస్తున్న నాయకులు
ప్రజాశక్తి-హిందూపురం : హిందూపురం పుర పాలక సంఘంలోని మురుగువాడల అభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఎమ్మెల్సీ షేక్ మహమ్మద్ ఇక్బాల్ పేర్కొన్నారు. మంగళవారం పురపాలక సంఘంలోని 32వ వార్డు లోని అహ్మద్ నగర్ లో రూ.41.5 లక్షలతో చేపట్టిన పెద్ద కాలువకు రక్షణ గోడ నిర్మాణం, నూతన సీసీ రోడ్డు నిర్మాణనికి భూమిపూజ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ ఇంద్రజ, వైస్ చైర్మన్ జబివుల్లా, కౌన్సిలర్ రేష్మా బాబు, కౌన్సిలర్లతో పాటు వైసిపి నాయకులు సోమశేఖర్ రెడ్డి, లతీఫ్ సేట్, ఖలీల్, కిరోసిన్ బాబు తదితరులు పాల్గొన్నారు.










