వైద్యపరీక్షలు నిర్వహిస్తున్న వైద్యులు
హిందూపురం : మార్చవ్యాధితో ఇబ్బందులు పడేవారు ఒంటరిగా సంచరించే సమయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని జనవిజ్ఞాన వేదిక జోనల్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఇటి రామ్మూర్తి అన్నారు. ఆదివారం పట్టణం ఆర్‌పిజిటి రోడ్‌లోని అల్‌హిలాల్ పాఠశాలలో జెవివి సహకారంతో మూర్ఛవ్యాధి ఉచిత వైద్యశిబిరం నిర్వహించారు. ఈసందర్భంగా 163 మందికి వైద్యసేవలు అందించి, వారికి రెండు నెలలకు సరిపడు మందులు అందించారు. ఈ శిబిరంలో జెవివి సభ్యులు అతావుల్లా, అంజన్ రెడ్డి, రామకృష్ణ, లక్ష్మీపతి, నాగేంద్రాచారి తదితరులు పాల్గొన్నారు.










