ప్రజాశక్తి-నెల్లూరు :నగర కార్పోరేషన్‌లో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులందరినీ పర్మినెంట్ చేసేవరకు పోరాటం చేస్తామని సిపిఎం నగర కార్యదర్శి కత్తి శ్రీనివాసులు పేర్కొన్నారు. బుధవారం మున్సిపల్ కార్మికులను ఫర్మినెంట్ చేయాలని డిమాండ్ చేస్తూ నగర పరిధిలోని 44, 45, 46 డివిజన్ల పారిశుధ్య కార్మికులు గాంధీ బొమ్మ సెంటర్లో ధర్నా చేపట్టారు. ఎపి మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ ( సిఐటియు ) గౌరవాధ్యక్షులు కత్తి శ్రీనివాసులు మాట్లాడుతూ మున్సిపల్ కార్మికులందరినీ ఫర్మినెంట్ చేస్తానని ప్రతిపక్షంలో ఉన్న సందర్భంలో జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీని తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. అమలు చేసేంతవరకు తాము పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. నగరపాలక సంస్థలో పనిచేస్తున్న కార్మికులు వివిధ రకాల సమస్యలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. పిఎఫ్ ఈఎస్‌ఐ బెనిఫిట్స్ అందడం లేదన్నారు. చట్ట ప్రకారం వర్తించాల్సిన సెలవులు అమలు చేయడం లేదని అన్నారు. అన్ని విభాగాల కార్మికులకు హెల్త్ అలవెన్స్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. మున్సిపల్ వర్కర్ సీనియర్ నగర కార్యదర్శి ఎం అశోక్, శ్రీకాంత్, మేరమ్మ,ఏడుకొండలు, మునిస్వామి ఉన్నారు.










