Dec 16,2022 22:01

పోస్టర్లు విడుదల చేస్తున్న నాయకులు

ప్రజాశక్తి - పుట్టపర్తి అర్బన్‌ : మున్సిపల్‌ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణించాలని అందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సిఐటియు నాయకులు డిమాండ్‌ చేశారు. కార్మికుల సమస్యలు పరిష్కరించాలంటూ అనంతపురంలో ఈ నెల 20న జరిగే బహిరంగ సభకు సంబందించిన గోడ పత్రికలను సిఐటియు నాయకులు శక్రవారం విడుదల చేశారు. అనంతరం నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జిల్లా మున్సిపల్‌ యూనియన్‌ కార్యదర్శి లక్ష్మీనారాయణ మాట్లాడుతూ సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్‌ చేస్తున్నామన్నారు. భూగర్భ మురుగునీటి పై పనిచేస్తున్న ఇంజనీరింగ్‌ కార్మికులకు కనీస వేతనాలు ఇవ్వాలని, హెల్త్‌ అలవెన్స్‌ ఇవ్వాలని కోరారు. ఈనెల 20న అనంతపురంలో ఉమ్మడి జిల్లాల కార్మికులతో సభ నిర్వహిస్తామన్నారు. 21, 22న మున్సిపల్‌ కార్మికుల ప్రతినిధుల సమావేశం ఉంటుందని ఆ సమావేశంలో భవిష్యత్తు కార్యాచరణ, చేపట్టబోయే ఉద్యమాలపై గురించి చర్చిస్తామని చెప్పారు. ఈ బహిరంగ సభలో రాష్ట్ర నాయకులు పాల్గొంటారన్నారు. జిల్లాలోని కార్మికులందరూ పెద్ద ఎత్తున బహిరంగ సభకు హాజరై విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిఐటియు మండల కార్యదర్శి గౌస్‌ లాజాం, యూనియన్‌ నాయకులు పెద్దన్న, నాగార్జున, సాయినాథ్‌, నాయకులు రమేష్‌, రమణ, గణేష్‌, రామదాసు, రామంజి, కేశవ, నరసింహులు తదితరులు పాల్గొన్నారు.