ప్రజాశక్తి ధర్మవరం టౌన్ : ధర్మవరం మున్సిపల్ ఛైర్‌పర్సన్ లింగంనిర్మల రెండు రోజుల క్రితం కౌన్సిల్ సమావేశంలో తన రాజీనామా పత్రాన్ని అసిస్టెంట్ కమిషనర్ మధుసూదన్‌రెడ్డికి అందజేశారు. ఈ క్రమంలో శుక్రవారం ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటుచేసి లింగం నిర్మల రాజీనామాను పాలకవర్గ సభ్యులు ఆమోదించారు. ఈ సందర్భం గా లింగంనిర్మల మాట్లాడుతూ తాను ఛైర్‌పర్సన్‌గా కొనసాగిన కాలంలో సహకరించిన అధికారులు, కౌన్సిలర్లకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం కంపోస్టు యార్డులో విధులు నిర్వర్తిస్తున్న పారిశుధ్య కార్మికుడు లింగన్న ప్రమాదవ శాత్తు గాయపడి చేయిని కోల్పోయిన నేపథ్యంలో పాలకవర్గ సభ్యులు సేకరించిన రూ.66, 500 నగదును లింగన్నకు అందజేశారు. ఈ సమావేశంలో అసిస్టెంట్ కమిషనర్ మధుసూదన్‌రెడ్డి, ఆర్‌ఒ ఆనంద్, ఇఇ సత్యనారాయణ, డిఇలు వన్నూరుస్వామి, సుధారాణి, శానిటరీ ఇన్స్‌పెక్టర్ మహబూబ్‌బాషా తదితరులు పాల్గొన్నారు.










