Jan 11,2023 22:02

బడ్జెట్‌ను చదివి వినిపిస్తున్న జెఎఒ శ్రీనివాసులు

ధర్మవరం టౌన్‌ : ధర్మవరం మున్సిపల్‌ కార్యాలయ స మావేశపు భవనంలో ప్రత్యేక బడ్జెట్‌ సమావేశాన్ని మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌ లింగం నిర్మల అధ్యక్షతన బుధవారం నిర్వహించారు.ఈ సందర్భంగా జెఎఒ శ్రీనివాసులు బడ్జెట్‌ అంశాలపై చదివి వినిపించారు. 2022-23 సంవత్సరానికి 37,52,77,673 రుపాయలు అంచనా వేయగా 2023-24 సంవత్సరానికి 50,71.98,840 రూపాయిలకు బడ్జెట్‌ అంచనాలు రూపొందించారు. అనంతరం చైర్‌పర్సన్‌ మాట్లాడుతూ ధర్మవరం పట్టణ అభివృద్ధికి అందరూ మరింత సహాయ సహకారాలు అందించాలన్నారు. ఇప్పటికే గత కౌన్సిల్‌ కంటే మున్సిపాలిటీని అభివృద్ధి చేశామన్నారు. మున్సిపాలిటీ పన్నులను చెల్లించడంలో కౌన్సిలర్లు ప్రజల్లో చైతన్యం తీసుకురావాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ కమిషనర్‌ మల్లికార్జున, అసిస్టెంట్‌ కమిషనర్‌ మధుసూదన్‌రెడ్డి, డిఇలు వన్నూర్‌ స్వామి, క్రిష్ణారావు, మేనేజర్‌ ఆనంద్‌. ఎఇలు ప్రతాప్‌, హరీశ్‌, శానిటరీ ఇన్స్‌పెక్టర్‌ మహబూబ్‌ బాషా, కౌన్సిలర్లు, కో ఆప్షన్‌ మెంబర్లు తదితరులు పాల్గొన్నారు.