ప్రజాశక్తి-ధర్మవరం టౌన్ మున్సిపాలిటీ అభ్యున్నతికి ప్రత్యేక నిధులు కేటాయించి కూరగాయల మార్కెట్‌లో అధునాతన భవనాల నిర్మాణం చేపట్టామని ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి తెలిపారు. సోమవారం స్థానిక కూరగాయల మార్కెట్‌లో నూతనంగా నిర్మించిన కాంప్లెక్స్‌లో మూడు గదులను ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం నిర్మాణంలో ఉన్న కాంప్లెక్స్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రూ.23లక్షలతో కూరగాయల మార్కెట్‌లో నూతన గదులు కాంప్లెక్స్‌ను నిర్మించామన్నారు. ప్రస్తుతం మూడు గదులను ప్రారంభించామని తెలిపారు. వచ్చేనెలలోపు అన్ని కాంప్లెక్స్‌లను ప్రారంభించేందుకు సిద్ధం చేయాలని మున్సిపల్ కమిషనర్ మల్లికార్జునను ఆదేశించారు. కూరగాయల మార్కెట్‌ను వచ్చే చిరు వ్యాపారులు ఇబ్బందులు పడకుండా ఏర్పాట్లు చేయాలన్నారు. మార్కెట్‌కు వచ్చే వారికి సులబ్ కాంప్లెక్స్ నిర్మించాలని, వాహనాల పార్కింగ్ తదితర మౌలిక సదుపాయాలు తప్పనిసరిగా కల్పించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్‌పర్సన్ లింగం నిర్మల, వైస్ ఛైర్మన్లు భాగ్యలక్ష్మి, పెనుజూరు నాగరాజు, కమిషనర్ మల్లికార్జున, డిఇ వన్నూరు స్వామి, ఎఇ హరీష్, కౌన్సిలర్లు చందమూరి నారాయణరెడ్డి, మాసపల్లి సాయికుమార్, రమాదేవి, అత్తర్ జిలాన్ భాష,గజ్జల శివ,కడపరంగస్వామి, కేత లోకేష్,బ్రహ్మయ్య, నాయకులు ఉడుముల రాము, రాయపాటి, చాంద్‌బాషా, చెలిమి పెద్దన్న, టౌన్‌బ్యాంకు డైరెక్టర్ రమేష్, ఎస్‌పి బాషా, సుబహాన్, తదితరులు పాల్గొన్నారు.
మూడు గదుల కాంప్లెక్స్‌ను ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి










