Aug 29,2023 23:03

మునేరు వద్ద పరిశీలిస్తున్న సామినేని

ప్రజాశక్తి - వత్సవాయి : మునేటి ఆయకట్టు రైతులు సాగునీటి విషయంలో ఎటువంటి ఆందోళన చెందవద్దు అని ప్రభుత్వవిప్‌, శాసనసభ్యులు సామినేని ఉదయభాను అన్నారు. మంగళవారం వత్సవాయి మండలం పోలంపల్లి గ్రామం నందు ఇరిగేషన్‌ అధికారులతో కలిసి మునేటి ఆనకట్టు మరమ్మత్తు పనులను ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వవిప్‌, జగ్గయ్యపేట నియోజకవర్గ శాసనసభ సభ్యులు సామినేని ఉదయభాను పరిశీలించారు. ఈ సందర్భంగా ఉదయభాను మాట్లాడుతూ ఇటీవల కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న మునేరు విషయంపై సిఎం జగన్‌ దృష్టికి తీసుకువెళ్లగా వెంటనే ఇరిగేషన్‌ అధికారులతో మాట్లాడి 1.80 కోట్లు మంజూరు చేయించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కేడీసీసీ బ్యాంక్‌ డైరెక్టర్‌ కొమ్మినేని రవి శంకర్‌,ఎంపీపీ కొలుసు రమాదేవి,గ్రామ సర్పంచ్‌ లాజర్‌ పాల్గొన్నారు.