Jul 13,2021 12:37

ముంబయి : ముంబయి ఎయిర్‌పోర్ట్‌లో అధికారులు భారీగా సైనైడ్‌ పట్టుకున్నారు. డిఆర్‌ఐ అధికారులు తెలపిన వివరాల మేరకు.. ముంబయి కార్గో ద్వారా దుబారు వెళుతున్న ఓ పార్సిల్‌లో రూ.32 కోట్ల విలువ చేసే గోల్డ్‌ పొటాషియం సైనైడ్‌ను గుర్తించినట్లు వెల్లడించారు. కస్టమ్స్‌ అధికారులను బురడి కొట్టించడానికి సైనైడ్‌ను కార్గో ద్వారా దుబారుకి తరలించే యత్నం చేశారని వివరించారు. విశ్వసనీయ సమాచారం మేరకు ముంబయి ఎయిర్‌పోర్ట్‌ కార్గోలో పార్సల్‌పై నిఘా పెట్టామని, ఓ పార్సిల్‌ అనుమానాస్పదంగా కనిపించడంతో తనిఖీలు చేశామని తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.