Jul 19,2022 22:56

ప్రజాశక్తి-వీరులపాడు : మండలంలోని పలు గ్రామాల్లో రైతులు వ్యవసాయ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. మండల పరిధిలోని జయంతి చౌటపల్లి కొనతాలపల్లి నరసింహారావు పాలెం గ్రామంల రైతులు మెట్ట పేర్లతోపాటు వరి పెద్ద ఎత్తున సాగు చేస్తున్నారు ఈ సంవత్సరం కాలంలో వర్షాలు ఆలస్యం అయినప్పటికీ రైతుల ఆశాజనంగా వర్షాలు మెట్ట పేర్లు పత్తి మొక్కజొన్న పలు కూరగాయ పంటలు ఆశాజనకంగా పంట పొలాలు కలకలాడుతున్నాయి. రైతులు కావలసిన ఎరువులు రైతుల అవసరాన్ని ఆసరా చేసుకుని వ్యాపారస్తులు అధిక రేట్లు ఎరువులు విక్రయించేస్తున్నారు రైతులు చేసేదేమీ లేక అధిక రేట్లు పెట్టి కొనుగోలు చేయాలి రైతులు ఆపోతున్నారు. ఎగో ప్రాంతాల్లో కురిసిన వర్షాలకు వైరా కట్టలేరు పెద్ద ఎత్తున నీరు చేరుకోవటంతో వరి సాగు చేయడానికి రైతులు సన్నద్ధమవుతున్నారు. వ్యవసాయ అధికారులు గ్రామాల్లో రైతులకు పంటలపై అవగాహన కల్పించి అధిక దిగుబడి కోసం కషి చేయాలని రైతులు రైతు సంఘం నాయకులు కోరుతున్నారు.