ప్రజాశక్తి-వలేటివారిపాలెం :మండలంలో పొగాకు 'అల్లకం' పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. మండ లంలో అత్యధికంగా మెట్ట ప్రాంతం కావ డంతో పొగాకు పంటను అధికంగా పండి స్తుంటారు. వలేటి వారిపాలెం, పోలినేనిపాలెం, నలదలపూరు, కలవళ్ల, నేకునాంపురం, పోలినేని చెరువు, అమ్మపాలెం, అంకభూ పాలపురం, లింగపాలెం తదితర గ్రామాలకు చెందిన రైతులు అధికసంఖ్యలో పొగాకును పండిస్తుంటారు. రబీ సీజన్‌లో పొగాకు పంట సాధారణ విస్తీర్ణం 2,084 హెక్టార్లు కాగా ఇటీవల తుఫాన్ ప్రభావంతో మండలంలోని పలుచోట్ల పొగాకు పంట దెబ్బతింది. దీంతో రైతులు తిరిగి పంటను సాగు చేపట్టాల్సి వచ్చింది. ప్రస్తుతం 996 హెక్టార్లలో పంట సాగవుతున్నట్లు వ్యవసాయ శాఖ నివేదికలు తెలుపు తున్నాయి. పొగాకు బ్యారన్లను రైతులు సిద్ధం చేసుకున్నారు. వలేటివారిపాలెం వైపు అల్లకం పనులు ముమ్మరంగా సాగుతు న్నాయి. మరికొన్నిచోట్ల ఇంకా పంట కోతకు రాలేదు. వ్యవసాయ సీజన్ కావడంతో వ్యవసాయ కూలీలకు సైతం చేతినిండా పని దొరుకుతుంది. పొగాకు బ్యారన్ల సీజన్ పూర్తయ్యేంత వరకు సుదూర ప్రాంతాల నుంచి కూలీలను సైతం ఇక్కడి రైతులు మాట్లాడుకొని తీసుకొస్తుంటారు. పొగాకు బోర్డు అధికారులు సైతం రైతులకు పలు సూచనలు చేస్తున్నారు










