రాయచోటి :క్రికెట్ స్టేడియం పనులను ముమ్మరం చేయాలని సంబందిత అధికారులను కలెక్టర్ గిరీష ఆదేశించారు. మంగళవారం పట్టణంలోని శివారు ప్రాంతమైన నక్కవాండ్లపల్లి సమీపంలో చురుగ్గా జరుగుతున్న క్రికెట్ స్టేడియం భూమి చదును పనులను క్షేత్ర స్థాయిలో కలెక్టర్ పరిశీలించారు. క్రికెట్ పిచ్ ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారు, మట్టి చదును పనులు ఎప్పటిలోగా పూర్తి చేస్తారు వాటి వివరాలను కలెక్టర్ అధికారులను అడిగి తెలుసుకొని త్వరగా పనులను పూర్తి చేయాలని ఆదేశించారు. క్రికెట్ మైదానం పనులను ప్రాపర్‌గా చేయాలని సూచించారు. బోర్ వెల్ వేసి వారంలోగా వాటర్ సప్లై ఇవ్వాలని ఆర్‌డబ్ల్యుఎస్ ఎస్‌ఇని ఆదేశించారు. క్రికెట్ స్టేడియంకు పవర్ సప్లై త్వరగా ఇవ్వాలని విద్యుత్ ఎస్‌ఇని ఆదేశించారు. అప్రోచ్ రోడ్డు, బిటి రోడ్డు పనులను కూడా పూర్తి చేయాలన్నారు. వంక ఆనుకొని కాంక్రిట్ రివిట్ మెంట్ పనులను కూడా చేయాలన్నారు. మైదానం చుట్టూ నీడని ఇచ్చే పెద్ద పెద్ద మొక్కలను నాటలని సూచించారు.కలెక్టర్ తో పాటు జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్‌ఖాన్, మున్సిపల్ కమిషనర్ గంగాప్రసాద్, విద్యుత్ ఎస్‌ఇ చంద్ర శేఖర్‌రెడ్డి, ఆర్‌డబ్ల్యుఎస్ ఎస్‌ఇ సి.ప్రసన్న కుమార్, ఆర్‌అండ్‌బి, రెవిన్యూ, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.










