ముమ్మరంగా ఎంఎల్‌సి ఎన్నికల ప్రచారం
ప్రజాశక్తి-ఆత్మకూరు అర్బన్ : ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు పట్టభద్రుల ఎంఎల్‌సి అభ్యర్థి మీగడ వెంకటేశ్వర్లు రెడ్డి, ఉపాధ్యాయ ఎంఎల్‌సి అభ్యర్థి పొక్కిరెడ్డి బాబురెడ్డికి మద్దతుగా శుక్రవారం పలు ప్రాంతాలలో యుటిఎఫ్, సిఐటియు, సిపిఎం నాయకులు ముమ్మరంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పిడిఎఫ్ అభ్యర్థులను గెలిపించాలంటూ ఓటర్లను కలుసుకొని అభ్యర్థించారు. శాసనమండలి సభ్యుల ఎన్నికలకు నగర మోగింది మార్చి 13వ తేదీ నిర్వహించాలని భారత ఎన్నికల కమిషన్ నిర్ణయించడంతో ఎంఎల్‌సి ఎన్నికల ప్రచారం పట్టణంలో జోరుగా సాగించారు. తమ అభ్యర్థులను గెలిపించాలని జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. కార్యక్రమంలో సిఐటియు, సిపిఎం నాయకులు మాజీ మున్సిపల్ వైస్‌చైర్మన్ షేక్ సంధాని, యుటిఎఫ్ నాయకులు గంగాధర్, పెంచలయ్య పెంచలయ్య, జన విజ్ఞాన వేదిక జిల్లా నాయకులు హరికృష్ణ, తదితరులున్నారు.










