Jan 20,2023 21:36

ట్రాన్స్‌ఫార్మర్‌ చుట్టూ ఉన్న ముళ్లకంపలు తొలగించిన దృశ్యం

రొద్దం : మండలంలోని దొడగట్ట గ్రామంలో హైస్కూల్‌ సమీపంలో ప్రమాదకర స్థితిలో ఉన్న విద్యుత్‌ నియంత్రిక చుట్టూ ఉన్న ముళ్లకంపలను తొలగించారు. పొంచి ఉన్న ప్రమాదం శీర్షికన ప్రజాశక్తి దినపత్రికలో గురువారం ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. విద్యుత్‌ నియంత్రికకు చుట్టూ పక్కల పెరిగిన కంపచెట్లు, తీగమొక్కలను విద్యుత్‌ అధికారులు తొలగించారు.