ములకలచెరువు : లోకేష్ పాద యాత్ర వంద రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా సోమ వారం ముల కలచెరువులో సంఘీభావంగా పాదయాత్ర చేపట్టారు. టిడిపి నాయ కులు, కార్యకర్తలు స్థానిక పెట్రోల్ బంక్ వద్దకు చేరుకొగా అప్పటికే వేచి చూస్తున్న వైసిపి కార్యకర్తలు వారి వద్ద నుంచి జెండాలను లాక్కున్నారు. టిడిపి, వైసిపి కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు రెండు గ్రూపులను తరిమేశారు. అనంతరం టిడిపి నాయకులు పాదయాత్రను ప్రారంభించాలని ప్రయత్నించిన వైసిపి వర్గీయులు మళ్లీ అడ్డుకునే పరిస్థితి ఉండ డంతో పోలీసులు పాదయాత్రను అనుమ తించలేదు. కవ్వింపు చర్యలకు దిగుతున్న వైసిపి కార్యకర్తలను మాత్రం పోలీసులు ఏమీ అనలేదు. టిడిపి కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. సంఘీభావ యాత్రకు అనుమతి లేదంటూ వెనక్కి వెళ్లిపోవాలని పోలీసులు అడ్డుకోవడంతో టిడిపి కార్యకర్తలు తిరుగుబాటు చేయడంతో పోలీసులు నియోజకవర్గ పరిశీలకుడు గురువారెడ్డితో పాటు పలువురు కార్య కర్తలను అదుపులోకి తీసుకొని పోలీస్‌స్టేషన్‌కు తర లించారు. సంఘటనా స్థలానికి మాజీ ఎమ్మెల్యే శంకర్ యాదవ్ చేరుకొని నాయకులకు, కార్య కర్తలకు భరోసా ఇచ్చారు. జాతీయ రహదారిపై కార్యకర్తలతో కలిసి శంకర్ రోడ్డుపై బైఠాయించారు. వైసిపి కార్యకర్తలు కట్టెలు, రాళ్లు, నీళ్ల బాటిళ్లు, కొబ్బరి కాయలతో దాడికి పాల్పడ్డారు. టిడిపి కార్య కర్తలు కూడా ప్రతి దాడులకు దిగుతుం డడంతో పోలీసులు లాఠీఛార్జి చేశారు. రాళ్ల దాడిలో పలువురు టిడిపి కార్యకర్తలు గాయపడ్డారు.










