Jun 06,2023 20:14

ఫొటో : మాట్లాడుతున్న రాష్ట్ర పోలీస్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ మెట్టుకూరి చిరంజీవి రెడ్డి

ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తా..
ప్రజాశక్తి-ఉదయగిరి : ఉదయగిరి-నందవరం డబుల్‌ రోడ్డు సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్తానని రాష్ట్ర పోలీస్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ మెట్టుకూరి చిరంజీవి రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం స్థానిక జిల్లా వక్ఫ్‌బోర్డ్‌ డైరెక్టర్‌ గడియాల్చి ఎస్టాని ఇన్‌స్టిట్యూట్‌లో వైసిపి నాయకులతో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉదయగిరి ప్రాంతానికి చెందిన పలు సమస్యలు జిల్లా వక్ఫ్‌బోర్డు డైరెక్టర్‌ గడియాల్సి ఎస్దాని తన దృష్టికి తెచ్చారు. పట్టణంలో ఉన్న కోనకాలువ ఉదయగిరి ప్రాంత ప్రజలకు నీటిదాహార్తి తీర్చే సంజీవని లాంటి నీరని, ప్రస్తుతం ఈ నీరు సరిగా రాకపోవడం వల్ల ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారని, ఈ విషయం రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా ఎంపి నిధులు మంజూరు చేయడానికి కృషి చేస్తానన్నారు.
అలాగే 50 పడకల ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్లు, నర్సులు, అంబులెన్స్‌, ఆక్సిజన్‌ తదితర సమస్యలు తీర్చేందుకు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లాలని, అలాగే దిలావార్‌ బావి వీధిలోవున్న హౌసింగ్‌ బోర్డు కాలనీకి సంబంధించి ఇళ్లను ప్రభుత్వానికి పనికొచ్చే విధంగా మార్చడానికి కృషి చేయాలని కోరారు. వెంటనే స్పందించిన మెట్టుకూరి సంబంధిత అధికారుల ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి సమస్యలను త్వరితగతిన పూర్తి అయ్యేందుకు కృషి చేస్తా హామీనిచ్చారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్‌ ముర్తుజాహుసేన్‌, మాజీ జెడ్‌పిటిసి శ్రీనివాసులురెడ్డి, ఎంపిటిసి కాలేషా, అనీల్‌, రఫి, మట్ల రామయ్య పాల్గొన్నారు.