కలకడ : వేసవి విజ్ఞాన శిబిరం ముగిశాయని కలకడ మండల శాఖ గ్రంధా లయ అధికారి అమర నాథ తెలిపారు. మండల కేంద్ర మైన కలకడ మం డల శాఖ గ్రంధాల యంలో విద్యార్థులకు పుస్తక పత్రం పాటలు పాడించడం వంటి కార్య కమాలు నిర్వహించినట్లు తెలిపారు. గతంలో వివిధ రకాల ఆటల పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు ప్రశంసా పత్రాలు, మెమొంటోలు బహుకరిం చినట్లు తెలిపారు. విజ్ఞాన శిబిరంతో విద్యార్థులలో తెలివితేటలతో పాటు ఆటలతో పట్ల విద్య పట్ల మక్కువ పెంచేందుకు అవకాశం ఏర్పడిందని ఆయన తెలియజేశారు.ఈ కార్యక్రమంలో విద్యార్థులు పాల్గొన్నారు. కలికిరి : గ్రంథాలయాలు ఆధునిక విజ్ఞాన దేవాలయాలని ఎస్‌ఐ రహీముల్లా అన్నారు. స్థానిక గ్రంథాలయంలో ఆదివారం వేసవి విజ్ఞాన శిబిరం ముగింపు కార్యక్రమం గ్రంధాలయ అధికారి విజయకుమార్ అధ్య క్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎస్‌ఐ ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడారు. విద్యార్థి దశ నుంచే ప్రతి ఒక్కరు గ్రంధాలయాలపై ఇష్టం పెంచుకోవాలని అన్నారు. విద్యార్థుల భవిష్యత్తు నిర్మా ణానికి గ్రంథాలయాలు ఎంతో దోహద పడుతాయని అన్నారు. విఆర్‌ఒ నరేంద్రరెడ్డి విద్యార్థులు గ్రంథాలయాలలో విధిగా పుస్తక పఠనం అలవర చుకోవాలని సూచించారు. కార్యక్రమంలో విద్యార్థులు, తల్లిదండ్రులు, పాఠ కులు, గ్రంధాలయ సిబ్బంది రెడ్డప్ప పాల్గొన్నారు. మదనపల్లె అర్బన్ : మదనపల్లె శాఖా గ్రంధాలయంలో జరుగుతున్న వేసవి విజ్ఞాన శిబిరం ఆదివారం ముగింపు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిదులు గా బిటి.కళాశాల కరస్పాండెంట్ మునిరత్నం, ఎంఇఒ ప్రభాకర్‌రెడ్డిలు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లా డుతూ గ్రంథాలయాల ద్వారా విజ్ఞాన సంపత్తిని పెంచుకొని విద్యార్థులు అభివద్ధి బాటలో ఎలా పయనించవచ్చో సాదో హరంగా వివరించారు. ఈ కార్యక్రమాన్ని జయ ప్రదంగా నిర్వహించిన రిటైర్డ్ మున్సిపల్ కమిషనర్ కే. సహదేవరావు, విశ్రాంత ఉపాధ్యాయులు, కళాకారులైన సర్వ శ్రీ రెడ్డప్ప, మదన మోహన్, ప్రసాద్ శర్మ, దీక్ష ప్రిన్సిపాల్ నాగా ర్జున. రమణమ్మ, మణి, భాను ప్రకాష్, చిత్ర లేఖన ఉపాధ్యాయులు వి.ఎం.నాగరాజ, శిరీష, కథ నవలా రచయిత టిఎస్‌ఎ.కష్ణమూర్తి, డాక్టర్ గొల్లపూడి తిరుపతిరావు, మిమిక్రీ కళాకారులు హెడ్ కానిస్టేబుల్ రామ్మూర్తి, వివేకానంద ఫౌండేషన్ భాను ప్రకాష్ లను గ్రంథాలయ అధికారిణి వసంత కుమారి, గ్రంథా లయ సిబ్బంది జయమ్మ తదితరులతో కలసి ఘనంగా సన్మానించారు. వేసవి విజ్ఞాన శిబిరంలో ఆంగ్ల తెలుగు భాషలలో వ్యాకరణం, వాక్య నిర్మాణం, చిత్రలేఖనంలో, పఠనంలో, కథలు చెప్పడంలో ప్రతిభ కనపరచిన విద్యార్థులకు బహుమతి ప్రధా నం చేసి ప్రశంసా పత్రాలు అందించారు. గాలివీడు: వేసవి శిక్షణ ముగింపు కార్యాక్రమంలో మిట్టపల్లి గోపికష్ణారెడ్డి పాల్గొని వ్యాసరచన, వకృత్వ పోటీలు, డ్రాయింగ్‌లో ప్రతిభ చాటిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో లైబ్రేరియన్ రామచంద్రనాయక్ విద్యార్థులు పాల్గొన్నారు. కురబలకోట: గ్రంథాలయాలు విజ్ఞాన భాండాగారాలని ఎంపిపి దస్తగిరి అన్నారు.35 రోజుల సమ్మర్ క్యాంప్ లో విద్యార్థులకు స్పోకెన్ ఇంగ్లీష్ చిత్రలేఖన, పెయింటింగ్, క్రాఫ్ట్, డ్రామా, పాటలు నిర్వహించడం జరిగిందని అన్నారు. పోటీలలో ప్రతిభ చాటిన విద్యా ర్థులకు బహు మతులు, ప్రశంసా పత్రాలు ప్రదానం చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ సుజాతమ్మ, గ్రంథాయ అధికారి చంద్రశేఖర్ నాయక్ పాల్గొ న్నారు. తంబళ్లపల్లి : స్థానిక గ్రంథాలయంలో మే 8వ తేదీ నుంచి ఈనెల 11వ తేదీ వరకు జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ నైనారు మధుబాల ఆదేశాల మేరకు నిర్వహించిన వేసవి శిక్షణశిబిరం ముగింపు కార్యక్రమం నిర్వహించారు. వివిధ అంశాల్లో ప్రావీణ్యాన్ని కనబరచిన విద్యార్థులకు బహుమతులు, ప్రశంసా పత్రాలను ప్రధానో పాధ్యాయులు జె.కృష్ణప్ప చేతుల మీదుగా అందించారు. కార్యక్రమంలో ఉపా ధ్యాయులు వెంకటకుమార్ పాల్గొన్నారు. పుల్లంపేట : మండల గ్రంథాలయ శాఖ ఆధ్వర్యంలో మే 8 నుంచి జూన్ 11వ తేదీ వరకు నిర్వహించిన వేసవి శిక్షణ శిబిరం ఆదివారం అట్టహాసంగా ముగించడం జరిగిందని గ్రంధాలయ నిర్వహణ అధికారి జయప్రకాష్ తెలిపారు. వేసవి శిక్షణ శిబిరాల్లో పాల్గొన్న విద్యార్థులు అందరికీ గ్రంథాలయాలలో సభ్యత్వం తీసుకోవాలని, పిల్లల తల్లిదండ్రుల ద్వారా కూడా సభ్యత్వం తీసుకుంటే గ్రంధాలయంలో ఉన్న పుస్తకాలను విరామ సమయంలో ఇంటి వద్దకు తీసుకెళ్లి చదువుకొనుటకు వీలవుతుందన్నారు. గెలు పొందిన విద్యార్థులకు ప్రశంసా పత్రాలు, బహుమతులు ప్రదానం చేశారు. కార్య క్రమంలో ఉపాధ్యాయులు ప్రకాష్‌రాజు, వెంక టరమణ, రెహమాన్, గ్రామ సభ్యులు మనో హర్‌రెడ్డి, నూకల శివ, 30 మంది విద్యార్థులు పాల్గొన్నారు.










