May 27,2023 21:52

ఫొటో : వలంటీర్‌ను సన్మానిస్తున్న దృశ్యం

ముగిసిన సన్మాన కార్యక్రమాలు
ప్రజాశక్తి-ఉదయగిరి : మండలంలో ప్రారంభమైన వలంటీర్లకు వందనం కార్యక్రమం శనివారంతో ముగిశాయి. చెరువు పల్లి సచివాలయ పరిధిలో సర్పంచులు గీత, తిరుపతమ్మ, నేలటూరు సచివాలయంలో సర్పంచ్‌ పద్మ ఉప సర్పంచ్‌ ద్వారపనేని చెన్నయ్య అధ్యక్షతన చేపట్టిన కార్యక్రమాలు ఘనంగా ముగిశాయి. ఈ సందర్భంగా సర్పంచులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు నవరత్నాలు సచివాలయం ద్వారా వాలంటరీలు అందించడం అభినందనీయమన్నారు.
వేకువజామునే ప్రతి గడపకు పెన్షన్‌ సంక్షేమ పథకాలను అందిస్తున్న వాలంటరీలకు ఈ సన్మాన కార్యక్రమం చేయడం సంతోషదాయకమన్నారు. కార్యక్రమంలో కార్యదర్శులు ఖాధర్‌ కరిముల్లా, ఆంజనేయులు, ఇత్తడి రమణయ్య, రాములు, ఎంపిటిసిలు, వార్డు మెంబర్లు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు పాల్గొన్నారు.