ముగిసిన పాదయాత్ర
ప్రజాశక్తి-ఉదయగిరి
సంఘీభావ పాదయాత్ర ప్రజల ఆదరణ నిరాజాలతో దిగ్విజయంగా ముగిసినట్లు టిడిపి ఇన్‌ఛార్జి ముత్తుముల అశోక్ రెడ్డి, నియోజకవర్గ పరిశీలకులు చెంచలబాబు యాదవ్ తెలిపారు. సోమవారం ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలోని టిడిపి ఇన్‌ఛార్జి ముత్తుముల అశోక్ రెడ్డి నియోజకవర్గ పరిశీలకులు పొన్నెబోయిన చెంచలబాబు యాదవ్ పాదయాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాజీ జెడ్‌పి చైర్మన్ చెంచలబాబుయాదవ్ మాట్లాడుతూ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా వారికి హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. గిద్దలూరు మండలం, కొంగలవీడు గ్రామంలోని అంకాలమ్మ దేవస్థానం నుండి గిద్దలూరు పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం వరకు సంఘీభావ పాదయాత్ర నిర్వహిచినట్లు వారు తెలిపారు. అనంతరం టిడిపి శ్రేణులతో సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో బిసి, ఎస్‌సి, ఎస్‌టి, మైనార్టీ అన్నీ వర్గాల ప్రజలు పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.










