Jan 17,2023 21:47

ఫొటో : విజేతలకు బహుమతి ప్రదానం చేస్తున్న దృశ్యం

ముగిసిన కబడ్డీ పోటీలు
ప్రజాశక్తి-వింజమూరు : పట్టణంలో కాకర్ల చారిటబుల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన కబడ్డీ పోటీలు మంగళవారం ముగిశాయి. వివిధ మండలాల నుండి 26 టీములు ఈ పోటీల్లో పాల్గొనగా బుచ్చి ఫైనల్‌ విజేతగా నిలిచింది. పట్టణంలోని జెడ్‌పి బార్సు హైస్కూల్‌ గ్రౌండ్స్‌లో ఫైనల్‌కు చేరుకున్న బుచ్చిరెడ్డిపాళెం బివిఆర్‌ స్పోర్ట్స్‌ అకాడమి టీం, వింజమూరు విఎంకెఎ కబడ్డీ అసోసియేషన్‌ టీములకు కాకర్ల చారిటబుల్‌ ట్రస్ట్‌ అధినేత కాకర్ల సురేష్‌ చేతుల మీదగా బహుమతి ప్రదానం చేశారు.
ప్రధమ బహుమతి రూ.40,116, ఎన్‌.సిరాజ్‌ కెప్టెన్‌గా వ్యవహరించి రన్నర్‌గా నిలచిన వింజమూరు విఎంకెఎ కబడ్డీ అసోసియేషన్‌ టీముకు రెండవ బహుమతి రూ.30,116, ఎన్‌.సిద్దిఖ్‌ కెప్టెన్‌గా వ్యవహరించిన విఎంకెఎ-2 టీం అండ్‌ జి.పవన్‌ ఆర్‌బి క్లబ్‌ బుచ్చిరెడ్డిపాళెం, రెండు టీములకు మూడవ బహుమతి రూ.15,116 మొదలగు బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో నిర్వాహకులు విఎంకెఎ కబడ్డీ అసోసియేషన్‌ నుసుమ్‌ సిద్దీఖ్‌, అప్పసముద్రం వీర బ్రహ్మచారి, రిఫరీలుగా వెలుగోటి కృష్ణ, నలగంగు ప్రభాకర్‌ రెడ్డి, పెద్దఎత్తున కబడ్డీ ప్రేమికులు పాల్గొన్నారు.