ముగిసిన 98వ గ్రిగ్ పోటీలు
ప్రజాశక్తి-ఇందుకూరుపేట : మండలంలోని నరసాపురం జిల్లా పరిషత్ హైస్కూల్‌లో సోమవారం నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో యువనేత దువ్వూరు కళ్యాణ్‌రెడ్డి సహకారంతో 98వ గ్రిగ్స్ టోర్నమెంట్స్ ఘనంగా ముగిశాయి. ఈ కార్యక్రమానికి కోవూరు నియోజకవర్గంలోని ముఖ్య నాయకులు హాజరై విజేతలకు మెడల్స్‌ను అందజేసి బహుమతి ప్రదానం చేశారు. ఈ సందర్భంగా పచ్చిపాల రాధాకృష్ణారెడ్డి మాట్లాడుతూ క్రీడలతో యువత మానసిక ఉల్లాసంతో పాటు, శారీరిక దృఢత్యం పొందుతారన్నారు. కళ్యాణ్‌రెడ్డి నియోజకవర్గ స్థాయిలో నిర్వహించే గ్రిగ్ పోటీలను రాష్ట్రస్థాయిని తలపించేలా నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. డిఎల్‌డిఎ చైర్మన్ గొల్లపల్లి విజయ కుమార్ మాట్లాడుతూ కళ్యాణ్ రెడ్డి ఏ కార్యక్రమం తలపెట్టిన ఆడంబరంగా నిర్వహించడం ఆయనకే సాటి అని కొనియాడారు. రాబోయే రోజుల్లో నియోజకవర్గం నుంచి క్రీడాకారులు రాష్ట్రస్థాయిలో తమ సత్తాను చాటాలన్నారు. ఈ సందర్భంగా క్రీడాకారులు, ఉపాధ్యాయులు దువ్వూరు కళ్యాణ్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ ఆయనను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో దొడ్డంరెడ్డి నిరంజన్‌బాబు, వీరి చలపతి, మావులూరు శ్రీనివాసులు రెడ్డి, ఎర్రంరెడ్డి గోవర్ధన్ రెడ్డి, గుణపాటి సురేష్ రెడ్డి, జెడ్‌పి వైస్ చైర్మన్ శ్రీహరి కోట జయలక్ష్మి, ఉడత వెంకటశేషయ్య, దేవిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, బందిల వెంకటరమణయ్య, ముంగర వెంకటేశ్వర్లు, దువ్వూరు మధుసూదన్ రెడ్డి, నర్సాపురం ప్రధానోపాధ్యాయులు నాగేశ్వరరావు, ఝాన్సీలతా, పల్లవి, ముజీర్, పలుపాఠశాలల పీడీలు, ప్రధానోపాధ్యాయులు, క్రీడాకారులు, విద్యార్థులు పాల్గొన్నారు.










