Jan 07,2023 20:59

ముగ్గులు వేస్తున్న దృశ్యం

ముగ్గులు వేస్తున్న దృశ్యం
ముగ్గుల పోటీలు
నెల్లూరు:కష్ణ చైతన్య ఇన్స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ కాకుటురులో
రంగవల్లి ముగ్గుల పోటీలు, మ్యూజికల్‌ చైర్‌ పోటీలు నిర్వహించారు.కష్ణ చైతన్య ఇన్స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ కాకుటూరులో శనివారం ఎంబిఎ, ఎంసిఎ, పిజి విద్యార్థులకు రంగ వల్లులు, మ్యూజికల్‌ చైర్స్‌ పోటీలు సంతూర్‌ సోప్‌ వారి సౌజన్యంతో నిర్వహించారు.ఈ పోటీలలో సుమారుగా వందమంది విద్యార్థులు పాల్గొన్నారు.ఈ పోటీలలో విద్యార్థినులు అందమైన ముగ్గులు వేశారు.ఈ పోటీలలో పాల్గొన్న విద్యార్థినులను కళాశాల డైరెక్టర్లు కష్ణారెడ్డి,పర్వతరెడ్డి చంద్రశేఖర్‌ రెడ్డి అభినందించి వారికి బహుమతులు అందజేశారు
.కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్‌ మల్లికార్జునయ్య, అడ్మిన్‌ ప్రిన్సిపల్స్‌ జ్యోతి, సుబ్బారావు, హెచ్‌ఒడి ప్రసాద్‌, ఫణి, ఇతర అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు.