ప్రజాశక్తి -కందుకూరు :రాష్ట్రంలో ఉన్న డాక్రా మహిళలకు రుణమాఫీ చేస్తానని ఇచ్చిన హామీ మేరకు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మూడో విడత వైయస్సార్ ఆసరా పథకాన్ని అమలు చేశారని ఎంఎల్‌ఎ మానుగుంట మహీధర్ రెడ్డి గురువారం చెప్పారు. కందుకూరు మున్సిపల్ కార్యాలయంలో మెప్మా ఆధ్వర్యంలో 3వ విడత ఆసరా కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఎంఎల్‌ఎ మహీధర్ రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల నాటికి ఉన్న బకాయిలను నాలుగు సార్లు చెల్లించి మాఫి చేస్తానని ఇచ్చిన మాట మేరకు మూడోసారి చెల్లించినట్లు తెలిపారు. మహిళలపై ఉన్న నమ్మకంతో రాష్ట్ర ముఖ్యమంత్రి అనేక పథకాలలో వారిని లబ్ధిదారులుగా చేర్చి ఉపయోగపడే విధంగా ఆర్థిక పరిపుష్టిని కలిగిస్తున్నాడని చెప్పారు. రుణమాఫీ చెక్కును సభ్యులకు అందజేశారు. జిల్లా మెప్మా పీడీ రవీంద్ర, మున్సిపల్ కమిషనర్ ఎస్ మనోహర్ తదితరులు పాల్గొన్నారు.










