Mar 30,2023 20:54

మూడేళ్లుగా మామి'డీ'లా

రాయచోటి : మూడేళ్లుగా మామిడి రైతులు ఢలాీ పడిపోయారు. సరైన దిగుబడి, గిట్టుబాటు ధరలు లేక నష్టాలు పాలయ్యారు. రెండేళ్లు కరోనా ప్రభావంతో లాక్‌డౌన్‌ కార ణంగా పండిన పంటకు ఎగుమతులు లేక తోటలకే వదిలేశారు. గత సంవత్సరమూ ఆశించిన స్థాయిలో దిగుబడి రాలేదు. గత ఏడాదిలో వర్షాలు అధికంగా కురవడంతో పూత బాగ వచ్చి కాయలు బాగా వస్తాయని రైతులు ఎంతో ఆశపడ్డారు. వారి ఆశించిన దానికంటే భిన్నంగా పూత ఆలస్యంగా ఎక్కువగా వచ్చింది. మంచు, వర్షం వాతావరణంలో మార్పు కారణంగా పూత చాలా వరకు నిలబడలేదు. దీంతో కాపు అంతంతమాత్రమే వచ్చింది. అధిక దిగుబడి సాధించడానికి, పూత రాలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి రైతులకు సూచనలిచ్చే అధికారులు లేకపోవడం శోచనీయం. అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా చిట్వేలు, 4400, కోడూరు 9067, ఓబులవారిపల్లి 1625, పెనగలూరు 3380, పుల్లంపేట 49 0, మదనపల్లి 1475, నిమ్మన పల్లి 2050, రామసముద్రం 1500, గుర్రం కొండ 4145, కలకడ 3445,కలికిరి 2737.5, క. వి.పల్లి 4625, పీలేరు 3500, వాయల్పడు 2875, నందలూరు 1780, రాజంపేట 935, టి. సుండుపల్లి 7590, వీరబల్లి 5262.5, చిన్నమండెం 6250, గాలివీడు 2300, లక్కిరెడ్డిపల్లి 6000, రామాపురం 3582.5, రాయచోటి 222.5, సంబేపల్లి 3075, బి.కొత్తకోట 715, కురబలకోట 750, ములకలచెరువు 625, పెద్దమండెం 1960, పిటిఎం 542.5, తంబళ్లపల్లె 750 ఎకరాల్లో మొత్తం 89,657.5 ఎకరాల్లో మామిడి తోటలు సాగులో ఉన్నాయి. ప్రతి ఏటా దాదాపు రూ.200 కోట్లకు పైగా విలువైన దిగుబడులు జిల్లా నంచి ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేస్తారు. ఈ సారి అధిక వర్షాలు, గాలులతో వాతావరణంలో మార్పులతో దిగుబడి తగ్గిపోవడంతో రైతులు ఆందోళనలో పడ్డారు. మామిడి చెట్లకు పూత, పిందె, కాత, కాయ, కోత దశలు ఎంతో కీలకం. సాధారణంగా నవంబరు నుంచి పూత రావడం జరుగుతూ ఉండేది. ఈసారి ఏడాది జనవరి, ఫిబ్రవరి మాసం పూర్తయిన తర్వాత పూత ప్రారంభమైంది. కొన్ని రకాల చెట్లలో అసలు పూత రాలేదు. గతంలో ఏప్రిల్‌ మామిడి పంట కోతలు కోసి పండ్లు వచ్చేవి. ఏడాది మార్చి నెల పూర్తవుతున్నా ఇంకా పిందెల దశలో ఉన్నాయి. ప్రతికూల పరిస్థితులతో తేనె మంచు, తామర, పూత తిచే పురుగులు, బూడిద, పూత, మాడు, ఆకుజల్లెడ తెగుపోతరాలిపోయినట్లు అధికారులు చెబుతున్నారు. అరకొర కాసిన మామడి కాయలు ఈదురు గాలులకు రాలిపోతాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. దిగుబడి సరిగ్గా రాకపోవడంతో వ్యాపారులు కూడా కాయలను కొనడానికి వెనకడుగు వేస్తున్నారు. మూడేళ్లుగా పంటలకు సరైన ఆదాయం రాలేదని రైతులు ఆవేదన చెందుతున్నారు. అరకొరగా పూత ఉన్న మామిడి చెట్లు