ప్రజాశక్తి-తోటపల్లిగూడూరు : ఇటీవల వివిధ కారణాలతో మతి చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరుల కుటుంబాలను వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి గురువారం పరామర్శించారు. వివరాల మేరకు.... తోటపల్లి గూడూరు మండలం వెంకన్నపాలెం గ్రామానికి చెందిన సర్పంచ్ చింతా సుబ్రహ్మణ్యం తల్లి, అలాగే అదే గ్రామానికి చెందిన పంది ఏడుకొండలు తల్లి, కొత్తపాలెం గ్రామానికి చెందిన అంగిలికం మహేంద్ర తండ్రి సుబ్రహ్మణ్యంలు మతి చెందారు. ఈ సందర్బంగా మంత్రి మతుల కుటుంబ సభ్యులను పరామర్శించారు. కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని నింపారు. అనంతరం మతుల చిత్ర పటాల వద్ద శ్రద్ధాంజలి ఘటించారు. ఈ కార్యక్రమాలలో మంత్రి గోవర్ధన్ రెడ్డి వెంట వైసీపీ రాష్ట్ర కార్యదర్శి, విజయ డైరీ మాజీ చైర్మన్ చిల్లకూరు సుధీర్ రెడ్డి, వైసీపీ మండల కన్వీనర్ ఉప్పల శంకరయ్య గౌడ్, స్థానిక వైసీపీ నాయకులు దువ్వూరు గంగాధర్ రెడ్డి, కావల్ రెడ్డి రంగారెడ్డి, కొత్తపాలెం మాజీ సర్పంచ్ వెంకట శేషయ్య, కంజి శ్రీరాములు, ముక్కంటి వీర రాఘయ్య, ఎంపీడీఓ కన్నం హేమలత, ఇంచార్జి తాసిల్దార్ శివయ్య ఉన్నారు.










