Feb 20,2023 21:04

- సమావేశంలో మాట్లాడుతున్న డిఎస్‌పి కేశప్ప

మదనపల్లె అర్బన్‌: యువత మత్తుకు బానిసైతే భవిష్యత్తు నాశనం అవుతుందని డిఎస్‌పి కె.కేశప్ప తెలిపారు. సోమవారం పట్టణంలోని శ్రీ జ్ఞానాంబిక డిగ్రీ కళాశాలలో మాదకద్రవ్యాలు వాటి వల్ల జరిగే అనర్థాలు యాంటీ డ్రగ్స్‌ అవేర్నెస్‌ సెమినార్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు చదువుకునే దశలో ఎలాంటి మత్తు పదార్థాలకు బానిస కాకుండా తల్లితండ్రులు కలలు కన్న బంగారు భవిష్యత్తు కోసం నిరంతరం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మాదకద్రవ్యాల నియంత్రణకు ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకుంటుందని ఆయన హెచ్చరించారు. మదనపల్లి టూ టౌన్‌ సిఐ మురళీకృష్ణ మాట్లాడుతూ మత్తు పదార్థాలు, మాదకద్రవ్యాల వినియోగం వల్ల జరిగే అనర్థాలను వివరిస్తూ యువత తమ విలువైన బంగారు భవిష్యత్తును ఎవరు తమ చేజేతులా నాశనం చేసుకోరాదని సూచించారు. మదనపల్లి తాలూకా సిఐ సత్యనారాయణ మాట్లాడుతూ తల్లిదండ్రులు పడే కష్టాలను విద్యార్థులు గుర్తించుకొని సత్ప్రవర్తనతో మెలగాలని సూచించారు. సమావేశంలో కళాశాల ప్రిన్సిపల్‌ రమాదేవి, అధ్యాపక బృందం పాల్గొన్నారు.