మత్తు పదార్థాలు ఆరోగ్యానికి హానికరం
ప్రజాశక్తి-ఇందుకూరుపేట : మత్తు పదార్థాలు ఆరోగ్యానికి హానికరమని, విద్యార్థులు ఇష్టంతో కష్టపడి చదివి ఎంచుకున్న లక్ష్యాన్ని చేరుకొని అందరికీ ఆదర్శంగా నిలవాలని ఎస్‌ఇబి సిఐ ఎం.బాలకృష్ణ పేర్కొన్నారు. శుక్రవారం ఇందుకూరుపేటలోని జివికె చిన్మయ విద్యాలయంలో విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు చెడు స్నేహాలకు దూరంగా ఉంటూ మంచి మార్గంలో వెళ్లాలన్నారు. మత్తు పదార్థాలకు చాలా దూరంగా ఉండాలన్నారు. ఇంట్లో తల్లిదండ్రుల్లో కూడా మార్పు రావాలన్నారు. అత్యవసర సమయాల్లో 14500 కాల్ సెంటర్‌కు ఫోన్ చేయాలన్నారు. చట్టాలపై అవగాహన పెంచుకొని చట్ట వ్యతిరేక కార్యక్రమాలను కలసికట్టుగా ఎదుర్కోవాలని తెలిపారు. కార్యక్రమంలో జివికె చిన్మయ విద్యాలయ ప్రధానోపాధ్యాయులు అజిత్‌ఠాగూర్, పాఠశాల సిబ్బంది, సెబ్ అధికారులు మస్తాన్, రాకేష్, విద్యార్థులు పాల్గొన్నారు.










