May 24,2023 21:58

ఫొటో : మాట్లాడుతున్న ఫిషరీస్‌ ఏడీ విజరు

మత్స్యకార మహిళలకు శిక్షణ
ప్రజాశక్తి-ఇందుకూరుపేట : మండలంలోని మైపాడు పట్టపుపాలెం మత్స్యకార మహిళలకు సేవ్‌ దీ చిల్డ్రన్‌ సంస్థ ఆధ్వర్యంలో బుధవారం శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మత్స్యకార మహిళలకు ఎండు చేపలు ఎండబెట్టుకొనుట, చేపలు, రొయ్యల ఊరగాయలు తయారీ విధానంతో లాభాలు చేకూర్చుకునే విధానాన్ని వివరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఫిషరీస్‌ ఏడీ విజరు విచ్చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మత్స్యకార మహిళలు ఈ శిక్షణ కార్యక్రమం వల్ల ఎన్నో ప్రయోజనాలు పొందవచ్చన్నారు. కార్యక్రమంలో కృషి విజ్ఞాన కేంద్రం సబ్జెక్ట్‌ మేటర్‌ స్పెషలిస్ట్‌ శ్రీహరి, ఎఫ్‌డిఒ సురేష్‌, విఎఫ్‌ఎ ఫర్వేజ్‌, వేలుగు సిసి ఇందిరమ్మ, జెడ్‌పి వైస్‌ చైర్మన్‌ శ్రీహరికోట జయలక్ష్మి, సొసైటీ ప్రెసిడెంట్‌ సీనయ్య, ఎంపిటిసి రమణయ్య, మాజీ ఎంపిటిసి ప్రసాద్‌, తదితరులు పాల్గొన్నారు.