ఓబులవారిపల్లె : నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగానికి తూట్లు పొడుస్తోందని, దేశంలో మతోన్మాదాన్ని పెంచిపోషిస్తోందని సిపిఎం, సిపిఐ జిల్లా కార్యదర్శులు శ్రీనివాసులు, నరసింహులు అన్నారు. బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా కార్మిక శ్రామిక వ్యతిరేక, అప్రజాస్వామిక విధానాలకు వ్యతిరేకంగా సిపిఎం, సిపిఐ ఆధ్వర్యంలో చేపట్టిని రాజకీయ ప్రచార భేరి బుధవారం మండలంలో సాగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మోడీ తొమ్మిదేళ్ల పాలనలో సాధించిన అభివద్ధి శూన్యమన్నారు. ప్రజల ఆస్తులైన ప్రభుత్వ రంగ సంస్థలు రైల్వే, రక్షణ, ఎల్‌ఐసి, బ్యాంకులు, ఓడరేవులను కార్పొరేట్ వ్యక్తులైన అదాని, అంబానీలకు అమ్మేస్తున్నారు. గో రక్షణ పేరుతో నిత్యం మైనార్టీలను, దళితులపై దాడులకు తెగబడుతున్నారు. బిజెపి అధికారంలోకి వస్తే ప్రధానమంత్రి మోడీ సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి నిరుద్యోగులను మోసం చేశారని విమర్శించారు. విదేశాల్లో ఉన్న నల్లధనాన్ని వెలికి తీసి పేదల అకౌంట్లో రూ.15 లక్షలు వేస్తానని హామీ ఇచ్చారని ఏమైందని ప్రశ్నించారు. మోడీ హటావో దేశం బచావో నినాదంతో ప్రజలందరూ మోడీ ప్రభుత్వాన్ని గద్దె దించాలని పిలుపునిచ్చారు. రైతులు, కార్మికులు, యువకులతో పాటు అన్ని వర్గాల ప్రజలు విసికెత్తిపోయారన్నారు. కార్యక్రమంలో వామపక్ష నాయకులు రవికుమార్, టి.రాధాకృష్ణ, చౌడవరం శంకరయ్య, జ్యోతి చిన్నయ్య, శివరామకృష్ణ దేవర, మణి, కృష్ణ చైతన్య, జయరాం, నాగమ్మ, రాజశేఖర్, సులోచనమ్మ, కేశం ప్రసాద్, దార్ల నాగేశ్వరరావు, సరోజినమ్మ, గంగయ్య, దాసరి జైచంద్ర, వెంకటరమణ, హరి ప్రసాద్, చెన్నకేశవ, పెంచలయ్య, వెంకటేష్, రోజమ్మ పాల్గొన్నారు. రాజంపేట అర్బన్ : బిజెపి అధికారంలోకి వస్తే ప్రధానమంత్రి మోడీ సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి నిరుద్యోగులను మోసం చేశారని సిపిఎం, సిపిఐ జిల్లా కార్యదర్శులు శ్రీనివాసులు, నరసింహులు అన్నారు. ప్రచార భేరి జీపు జాతా సాయంత్రం పట్టాణానికి చేరుకుంది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మోడీ ప్రభుత్వాన్ని గద్దె దించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో నాయకులు పి.మహేష్, రాయుడు, సికిందర్, వెంకటయ్య, సులోచనమ్మ, రాజశేఖర్, నాగమ్మ, నాగేశ్వరరావు, జయరాం, వెంకటేష్, సుబ్రహ్మణ్యం, శ్రీనివాసులు పాల్గొన్నారు.










