మతోన్మాద బిజెపిని సాగనంపుదాం..
ప్రజాశక్తి-ఉదయగిరి : మతోన్మాద బిజెపి ప్రభుత్వాన్ని సాగనప్పేందుకు ప్రతిఒక్కరూ సిద్ధం కావాలని సిపిఎం మండల కార్యదర్శి పర్ధిన్‌బాషా పిలుపునిచ్చారు. శనివారం స్థానిక మసీద్ కాంప్లెక్స్‌లో ప్రజా వ్యతిరేక విధానాలు నిరంకుశ విధానాలను అనుసరిస్తున్న ప్రధాని మోడీని ఇంటికి సాగనంపాలని ప్రతి ఒక్కరూ ఒక్కటి కావాలన్నారు. ప్రభుత్వానికి ఆదాయాన్ని తెస్తున్న ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్ శక్తులకు అప్పచెబుతూ జిఎస్‌టి భారాన్ని మోపి ప్రజలను దోచుకుంటున్నారని దుయ్యబట్టారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల వల్లే దేశంలో నిరుద్యోగం తాండవిస్తుందని పెట్రోల్, గ్యాస్, డీజిల్ ధరలు పెంచి సామాన్య ప్రజల రక్తాన్ని తాగుతున్నారని ద్వాజమెత్తారు. పెరిగిన నిత్యావసర ధరలు తగ్గించకుండా ప్రజలపై రాక్షస పాలన చూపుతున్న మతోన్మాద బిజెపిని సాగనంపుదాం.. దేశాన్ని కాపాడుకుందాం.. అంటూ నినాదాలు చేశారు. కార్యక్రమంలో సిపిఎం సిఐటియు రైతు సంఘ నాయకులు కాకు వెంకటయ్య పందిళ్ళ వెంకటేశ్వర్లు దుకాణ యాజమానులు కార్మికులు పాల్గొన్నారు.










