వాల్మీకిపురం : ముస్లింలు అత్యంత పవిత్రంగా భావించే రంజాన్ పండుగను అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. చిన్నా పెద్దా అందరూ కొత్త బట్టలు ధరించి ఉత్సాహంగా మసీదులకు చేరుకొని, ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం ఒకరికొకరు ఆలింగనం చేసుకొని రంజాన్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. స్థానిక నిమ్మనపల్లె బస్టాండ్, బండమకాన్‌వీధుల్లోని మసీదుల్లో, హసన్‌ఖాన్‌వీధిలోని దర్గా, బైపాస్ రోడ్డు, నమాజ్‌కట్టవీధుల్లోని ఈద్గాల వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా మత పెద్దలు మాట్లాడుతూ త్యాగానికి ప్రతీక రంజాన్ అని, ప్రతి ఒక్కరూ కుల, మతాలకు అతీతంగా ఎదుటి వారిని ప్రేమిస్తూ, పరోపకార గుణాన్ని అలవర్చుకొని అల్లా చూపిన సన్మార్గంలో నడుచుకోవాలని ఉద్బోధించారు. కలకడ : మండల కేంద్రమైన కలకడలో ముస్లిం సోదరులు భక్తిశ్రద్ధలతో రంజాన్ పండుగ వేడుకలను నిర్వహించుకున్నారు.గత 30 రోజులుగా కఠిన ఉపవాసాలు ఉండి రంజాన్ పండుగను అంగరంగ వైభవంగా నిర్వహించుకోవడం జరిగింది. మండలంలో కోన, పాపిరెడ్డిగారిపల్లి, ఎర్రకోటపల్లి, నడిమిచర్ల, బంగారువాండ్లపల్లి, ఎర్రయ్యగారిపల్లి, గ్రామాలలో ముస్లిం సోదరులు ఈద్గాల వద్ద ప్రార్థనలు నిర్వహించారు. వీరబల్లి : రంజాన్ పండుగను మండల వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో ముస్లింలు ఘనంగా జరుపుకున్నారు. కొత్త వస్త్రాలు ధరించి ఉదయం నుంచి మసీదులు, దర్గాల్లో ప్రత్యేక ప్రార్ధనలు చేశారు.మండలంలోని అన్ని మసీదులు ముస్లింలతో కళకళలాడాయి. ఒకరినొకరు ఆ లింగనం చేసుకుని శుభాకాంక్షలు తెలుపుకున్నారు. పీలేరు : పీలేరులో ముస్లింలు ఈద్-ఉల్-ఫితర్ పండుగ వేడుకలను ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని అన్ని మసీదుల నుంచి ముస్లీం సోదరులు స్థానిక జెండామాను దగ్గరకు చేరుకుని, అక్కడి నుంచి సామూహిక ప్రార్థనలుచేశారు. ముస్లీంలు తాము చేసుకునే పండుగల్లో అతి ముఖ్యమైన పండుగ ఈద్ -ఉల్-ఫితర్ ఒకటని, రంజాన్ పండుగ ప్రార్థనల అనంతరం వారి శక్తి కొలదీ పేదలకు నగదు, వస్త్ర దానాలు చేసుకుంటారన్నారు. సిఐ మోహన్‌రెడ్డి పర్యవేక్షణలో ఎన్‌ఐ నరశింహుడు, ఎక్కడా ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా గట్టి బందో నిర్వహించారు. వాహనాల రాక పోకలను కూడా నియంత్రించి ట్రాఫిక్ సమస్యను నియంత్రించారు. నిమ్మనపల్లి : నిమ్మనపల్లిలో ముస్లిం సోదరులు ఈద్-ఉల్-ఫితర్ (రంజాన్) పండుగ వేడుకలను ఘనంగా నిర్వహించారు. మండలంలోని అన్ని మసీదుల నుంచి ముస్లీం సోదరులు సామూహిక ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఈ సామూహిక ప్రార్ధనలో మత గురువు మాట్లాడుతూ ప్రజలను ఈతి బాధలు, వేసవి ఎండల నుంచి కాపాడలిని, ప్రజలు, పశు, పక్షాదులు అంతు తెలియని వింత వ్యాధుల బారిని పడకుండా కాపాడాలని, జనాల్లో పరమత సహనాన్ని, సాటి వ్యక్తుల పట్ల ప్రేమానురాగాలని కలిగి ఉండేలా చూడాలని ప్రార్థించి వేడుకున్నారు. ఇన్‌ఛార్జి ఎస్‌ఐ సుధాకర్ ఆదేశాల మేరకు హెడ్ కానిస్టేబుల్ రమేష్‌బాబు, నవయుగనాథ్, కానిస్టేబుల్ కేశవ ఇతర పోలీస్ సిబ్బంది గట్టి బందోబస్తును ఏర్పాటు చేసి పర్యవేక్షించారు. నందలూరు : మండల వ్యాప్తంగా ముస్లింలు ఘనంగా రంజాన్ వేడుకలు నిర్వహించుకున్నారు. భక్తిశ్రద్ధలతో ఉపవాస దీక్షలు శుక్రవారంతో పూర్తి చేసుకొని, శనివారం ఉదయం పలు ఈద్గా మైదానాలలో ఈద్-ఉల్-ఫితర్ జరుపున్నారు. వేడుకల్లో జిల్లా వక్ప్‌బోర్డ్ ప్రధాన కార్యదర్శి సయ్యద్ అమీర్, మండల కో-ఆప్షన్ సభ్యులు కరీముల్లా ఖాన్, నందలూరు ఉపసర్పంచ్ ఇబ్బు, నందలూరు ఎంపిటిసి సుభాన్ భాష, టిడిపి నాయకులు మాభాష, గౌస్ బేగ్, పెద్ద ఎత్తున ముస్లిం సోదరులు, పాల్గొన్నారు. కలికిరి : ముస్లింలు రంజాన్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని అన్ని మసీదుల నుంచి ముస్లీం సోదరులు కలికిరి క్రాస్ రోడ్డు లోని జామియా మసీదు వద్దకు చేరుకుని, అక్కడి నుంచి సామూహికంగా అల్లాను స్తుతిస్తూ కొత్తగా నిర్మించిన ఈద్గా మైదానం చేరుకుని ప్రత్యేక ప్రార్ధనలు జరుపుకున్నారు. పండుగ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటన చోటు చేసుకోకుండా ఎస్‌ఐ లోకేష్ రెడ్డి తన సిబ్బందితో పర్యవేక్షించారు. బి.కొత్తకోట : మండలంలో ముస్లిం సోదరులు రంజాన్ వేడుకలను భక్తిశ్రద్ధలతో ఘనంగా జరుపుకున్నారు. పిటియం రోడ్డులోని ఈద్గా వద్దకు అధిక సంఖ్యలో ముస్లిం సోదరులు చేరుకుని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. కార్యక్రమంలో సచివాలయం కన్వీనర్ ఎస్‌ఎస్ ఫయాజ్, గుమ్మడికాయల చాంద్ బాషా, మార్కెట్ యార్డ్ డైరెక్టర్ అయుబ్ బాషా, డాక్టర్ అరిఫ్, అహ్మద్ బాషా, హైదర్, సాదిక్, సద్దాం, ఖాదర్ బాషా, మున్షిద్, ముబీద్,మియా, పీర్ భాష, కాలేషా, షమీ, షాను, జాఫర్ బై, స్వాతి జిరాక్స్ సెంటర్ చాంద్ బాషా, కో-ఆప్షన్ మెంబర్ నాసర్, సిపిఐ సలీం, సిపిఐ బషీర్, ఎంపిటిసి సయ్యద్, అల్తాఫ్ పాల్గొన్నారు. గాలివీడు : రంజాన్ పండుగ సందర్భంగా మండల వ్యాప్తంగా ముస్లిం సోదరులు ఈద్గాల వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేసి ఘనంగా రంజాన్ వేడుకలు జరుపుకున్నారు. ముస్లిం సోదరులు పేదవారికి అన్నదాన కార్యక్రమం, దుస్తులు, నగదు పంపిణీ చేశారు. రాజంపేట అర్బన్ : మత సామరస్యానికి ప్రతీకగా రంజాన్ పండుగను జరుపుకోవడం హర్షణీయమని నియోజకవర్గ టిడిపి నాయకులు చమర్తి జగన్‌మోహన్‌రాజు పేర్కొన్నారు. రంజాన్ పండుగ సందర్భంగా పట్టణంలోని జానీ బాషాపురం మసీద్ సందర్శించి ప్రత్యేక ప్రార్థనలో పాల్గొని ముస్లిం సోదరులకు ఈద్‌ముబారక్ రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.కార్యక్రమంలో అయన వెంట మత గురువు ఆజామ్, మసీదు కమిటీ సభ్యులు జానీ బారు, టిఎన్‌ఎస్‌ఎఫ్ పార్లమెంట్ అధ్యక్షులు పోలి శివకుమార్, పార్లమెంట్ మైనారిటీ సెల్ ఆర్గనైజింగ్ కార్యదర్శి మండెం కరీముల్లా, యువ నాయకులు సూర్యనారాయణ రాజు, వీరబల్లి సుధాకర్ రాజు, తెలుగుయువత పట్టణ ప్రధాన కార్యదర్శి సుహేల్, మైనారిటీ నాయకులు హబీబ్ పాల్గొన్నారు. పెద్దమండ్యం: మండలంలో శనివారం ముస్లిం సోదరులు రంజాన్ పండుగ సందర్భంగా ఈద్గా వద్దకు వెళ్లి ప్రత్యేక ప్రార్ధనలు చేశారు. పెద్దమండ్యం, కలిచెర్ల, సిద్దవరం, తురకపల్లి, వెళిగల్లు, శివపురం, ముసలీకుంట, బంద్రేవు, పాపేపల్లి తదితర గ్రామాల్లో మసీదులో గత నెల రోజులుగా ఉపవాస దీక్షలో ఉన్న ముస్లిం సోదరులు మత ప్రబోదకుడు వెంట ఈద్గా వద్దకు మంగళ వాయిద్యాలు తో మూకు మ్మడిగా దైవ ప్రార్థనలు చేసుకుంటూ అక్కడికి చేరుకున్నారు. ఈ సంవత్సరం రెండు జమాత్‌లు ఒక్కటై అందురూ కలిసి ఓకే ఈద్గా వద్దకు వెళ్లి ప్రార్థనలు చేశారు.తంబళ్లపల్లి : మండల కేంద్రంలో శనివారం ముస్లిం సోదరులు రంజాన్ పండుగను భక్తిశ్రద్ధలతో ఘనంగా జరుపుకున్నారు. మసీదు నుంచి ఊరేగింపుగా అల్లాను ప్రార్థిస్తూ ఈద్ ఘవత్ సిద్దారెడ్డి గారిపల్లి క్రాస్ లోని ఈద్ ఘవత్ వద్దకు చేరుకున్నారు. మత గురువు యూసఫ్ మహా ప్రవక్త గురించి వివరించారు.










