ఫొటో : వినతిపత్రం అందజేస్తున్న సిపిఎం నాయకులు
మస్టర్లపై సమగ్ర దర్యాప్తు జరపాలి
ప్రజాశక్తి-అనంతసాగరం : మండలంలోని సంజీవనగరం గ్రామంలో గత రెండు, మూడు నెలల నుండి ఉపాధి హామీ పనులు పెట్టకుండానే దాదాపు 30 మంది పేర్ల మీద దొంగ మస్టర్లు అన్‌లైన్ చేయించి గత నెలలో ఉపాధి హామీ కూలి డబ్బులు పడినప్పుడు తీసుకున్నట్లు సిపిఎం పార్టీ ఆరోపించింది. ఆ రెండు, మూడు నెలలలో సంజీవనగరం గ్రామంలో ఉపాధి హామీ పనులు పెట్టలేదని జరిగిన అవకతకలపై సమగ్రమైన దర్యాప్తు జరపాలని శనివారం ఎంపిడిఒ, ఉపాధి హామీ పథకం ఎపిఒను సిపిఎం మండల కార్యదర్శి అన్వర్‌బాషా కలిసి వినతపత్రం అందించారు. కార్యక్రమంలో రాటకొండ పెంచలనాయుడు, వెంకటేష్, తదితరులు పాల్గొన్నారు.










