వక్ఫ్ బోర్డ్ చైర్మన్ కరీముల్లాను సన్మానిస్తున్న నాయకులు
ప్రజాశక్తి-మదనపల్లె అర్బన్: మదనపల్లెలో మసీదులు, ఈద్గాల అభివృద్ధికి రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డి, ఎమ్మెల్యే నవాజ్‌బాషా సహకారంతో కృషి చేస్తానని వక్ఫ్ బోర్డ్ చైర్మన్ ఎస్.ఎ.కరీముల్లా తెలిపారు. శుక్రవారం పట్టణంలోని జగన్ కాలనీ మసీదులో ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. మసీదు కమిటీ పెద్దలు సన్మానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్ర మైనారిటీ కమిషన్ చైర్మన్ సహాయ సహకారాలతో అభివృద్ధికి ప్రాధాన్యతిస్తూ ముందుకు వెళ్తామని చెప్పారు. కార్యక్రమంలో మైనార్టీ పెద్దలు, మసీదు కమిటీ పెద్దలు పాల్గొన్నారు.










