Apr 15,2023 21:04

మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చెక్కు ఇస్తున్న ఎంపీ, ఎమ్మెల్యే

 బి.కొత్తకోట : పెద్దతిప్పసముద్రం మండలంలోని కానుగమాకులపల్లిలో జరిగిన విద్యుత్‌ ప్రమాద ఘటనపై రాజంపేట ఎంపీ వెంకట మిథున్‌రెడ్డి, పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి తీవ్ర దిగ్రాÄ్భంతి వ్యక్తం చేశారు. శనివారం బి.కొత్తకోట మండలంలోని వడిగలవారిపల్లికి చెందిన లక్ష్మణ్‌, శాంతి కుమారి, లక్ష్మమ్మ, విజరు ప్రశాంత్‌ కుటుంబాలను పరామర్శించి మృతదేహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గృహప్రవేశం వేళ ఇలాంటి ఘటన చోటుచేసుకోవడం దురదృష్టకరమన్నారు. మృతుల కుటుంబాలకి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. తక్షణ సాయం కింద మృతి చెందిన ఒక్కొక్కరికి రూ.ఐదు లక్షలు చెక్కును అందజేశారు. గాయపడిన సునీత (40), సుధాకర్‌ (48), సుబ్బమ్మ (50)లకు తక్షణ సహాయంగా ఒక్కొక్కరికి రూ.2 లక్షలు అందజేశామన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నామన్నారు. కార్యక్రమంలో పలమనేరు నియోజకవర్గం పరిశీలకులు పాగొండ ఖలీల్‌ అహ్మద్‌, కొండా సిద్ధార్థ, ఎస్‌ఎస్‌ ఫయాజ్‌, తిరుమల, సంతోష్‌, వైసిపి జిల్లా ప్రచార కార్యదర్శి అయూబ్‌ బాషా, జెఎసి మండల సచివాలయ కన్వీనర్‌రెడ్డి హరి పాల్గొన్నారు.
ఘటన దురదృష్టకరం : టిడిపి
కానుగమాకులపల్లె జరిగిన విద్యుత్‌ ప్రమాదంలో నలుగురు మృతి చెందడం దురదృష్టకరమని టిడిపి రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి ఎస్‌.ఎం.పర్వీన్‌ తాజ్‌, ఆమె భర్త నూర్‌అహ్మద్‌ పేర్కొన్నారు. మృతదేహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.