ప్రజాశక్తి -కందుకూరు :గత డిసెంబర్ 28వ తేదీన కందుకూరులో జరిగిన తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయిన మండలంలోని కొండముడుసుపాలెం గ్రామానికి చెందిన కలవకూరి యానాది, ఓగూరు గ్రామానికి చెందిన గడ్డం మధు, పట్టణానికి చెందిన కాకుమాని రాజా, ఈ దమూడి రాజేశ్వరి కుటుంబాలను నెల్లూరు పార్లమెంట్ టిడిపి అధ్యక్షులు షేక్ అబ్దుల్ అజీజ్, కందుకూరు నియోజకవర్గ ఇన్‌ఛార్జి ఇంటూరి నాగేశ్వరరావు, పార్టీ రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శి దివి శివరాం ఆదివారం పరామర్శించారు. ప్రమాదం జరిగిన వెంటనే స్పందించి పలువురు దాతలు ప్రకటించిన రూ. 4.00 లక్షల ఆర్థిక సాయాన్ని నేతలు వారికి అందజేశారు. కుటుంబ సభ్యులు నారా చంద్రబాబు నాయుడుకి, దాతలకు, తమకు అన్ని విధాల అండగా నిలిచిన ఇంటూరి నాగేశ్వరరావుకి కతజ్ఞతలు తెలిపారు. పట్టణ పార్టీ అధ్యక్షుడు దామా మల్లేశ్వరరావు, మాజీ పట్టణ అధ్యక్షులు పిడికిటి వెంకటేశ్వర్లు, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ ఉప్పుటూరి శ్రీనివాసరావు, టిడిపి నాయకులు జెనీ రమణయ్య, రాజా నాయుడు, మేకల నరేంద్ర రెడ్డి, పెంచల నాయుడు, సాబీర్ ఖాన్ ఉన్నారు.
గుడ్లూరు మండలంలో : డిసెంబర్ 28వ తేదీన కందుకూరులో జరిగిన తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయిన గుడ్లూరు మండలం, అమ్మవారిపాలెం గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ కార్యకర్త మర్లపాటి చిన్న కొండయ్య కుటుంబానికి నెల్లూరు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు షేక్ అబ్దుల్ అజీజ్, కందుకూరు నియోజకవర్గ ఇంచార్జ్ ఇంటూరి నాగేశ్వరరావు, పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి దివి శివరాం ఆదివారం పరామర్శించారు. ప్రమాదం జరిగిన వెంటనే స్పందించి పలువురు దాతలు ప్రకటించిన 4.00 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని నేతలు వారికి అందజేశారు. మండల పార్టీ అధ్యక్షులు జనిగర్ల నాగరాజు, పట్టణ పార్టీ అధ్యక్షుడు దామా మల్లేశ్వరరావు ఉన్నారు.
ఉలవపాడు :కందుకూరులో జరిగిన తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయిన ఆత్మకూరుకు చెందిన దేవినేని రవీంద్ర, ఉలవపాడు గ్రామములోని వరిగచేను సంగానికి చెందిన యాటగిరి విజయ కుటుంబ సభ్యులను నెల్లూరు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు షేక్ అబ్దుల్ అజీజ్, కందుకూరు నియోజకవర్గ ఇంచార్జ్ ఇంటూరి నాగేశ్వరరావు, పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి దివి శివరాం పరామర్శించారు. ప్రమాదం జరిగిన వెంటనే స్పందించి పలువురు దాతలు ప్రకటించిన 4.00 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని నేతలు వారికి అందజేశారు. ఉలవపాడు మండల అధ్యక్షులు రాచగర్ల సుబ్బారావు, మండల ప్రధాన కార్యదర్శి శ్రీను, గ్రామ సర్పంచ్ నాళం గోవిందమ్మ, బెల్లం కష్ణమోహన్, రాములు డి హనుమంతరావు ఉన్నారు.
పూర్తి స్థాయిలో ఆదుకుంటాం : ఆజీజ్
ప్రజాశక్తి -కందుకూరు :పట్టణంలో చంద్రబాబు నాయుడు సభలో తొక్కిసలాట జరిగి మరణించిన కుటుంబాలకు రూ.26లక్షలు ఆర్థిక సాయం చేయడానికి టిడిపి నిర్ణయించిందని నెల్లూరు పార్లమెంటు టిడిపి అధ్యక్షులు ఎస్‌కె అబ్దుల్ అజీజ్ చెప్పారు. ఆదివారం ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. చంద్రబాబు నాయుడు సభను జయప్రదం చేయడానికి వచ్చిన టిడిపి కుటుంబ సభ్యులు మరణించడం తమకు ఎంతో బాధ కలిగించిందన్నారు. ఆయా కుటుంబాలను ఆదుకోవాలనే ఉద్ధేశ్యంతో చంద్రబాబు నాయుడు రూ.15లక్షలు ఒక్కొక్కరికి అందజేశారన్నారు. మిగిలిన మొత్తం రూ.11లక్షలు టిడిపి నాయకులు ఇవ్వడానికి ముందుకు వచ్చారని చెప్పారు. చనిపోయిన వారితో పాటు గాయపడిన వారికి కూడా కందుకూరు టిడిపి నియోజకవర్గ ఇన్చార్జి నాగేశ్వరరావు రూ.5 లక్షల ఇచ్చారని చెప్పారు. ఇప్పటికీ రూ.22.5 లక్ష ఇవ్వడం జరిగిందని ఇంకా రూ.3,50,000 ఇవ్వాలని ఇవ్వడానికి ముందుకు వచ్చిన నాయకులు అందుబాటులో లేనందున ఆ డబ్బులు ఇంటూరి నాగేశ్వరరావు, దివి శివరాం వారం రోజుల లోపల వారికి చేరుస్తారని తెలిపారు. కందుకూరు టిడిపి ఇన్చార్జ్ ఇంటూరి నాగేశ్వరావు మాట్లాడుతూ ఆర్థిక సాయం విషయంలో కూడా రాజకీయాలు చేయడం బాధాకరమన్నారు. ఇంకా ఇవ్వాల్సిన డబ్బులు కూడా త్వరలోనే వారికి చేరుస్తామని నాగేశ్వరరావు చెప్పారు. టిడిపి నాయకులు జెనీ రమణయ్య, రాజా నాయుడు, మేకల నరేంద్ర రెడ్డి, పెంచలనాయుడు, సాబీర్ ఖాన్, జలదంకి సుధాకర్, అల్లాబక్షు, సురేంద్ర పట్టణ పార్టీ అధ్యక్షుడు దామా మల్లేశ్వరరావు ఉన్నారు.










